అశేష జనవాహిని,
అశ్రు నయనాల నడుమ
భాస్కర్ కు వీడ్కోలు
పుట్టల భాస్కర్
కుటుంబానికి అండగా ఉంటా
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపిటిసి పుట్టల సత్యవతి భర్త, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పుట్టల భాస్కర్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం హైదరాబాద్ నిమ్స్ ఆసు పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్యతో పాటు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. పుట్టల భాస్కర్ మరణవార్త తెలుసుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు బాస్కర్ రావు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఆసుపత్రి బిల్లును చెల్లించి భాస్కర్ మృతదేహానికి నివాళ్ళర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాన్ని వేములపల్లి తీసుకొనివచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

వేములపల్లి మండలకేంద్రంలోని మృతుని స్వగృహంలో పుట్టల భాస్కర్ పార్థివదేహాoపై జిల్లాపరిషత్ కోఅప్షన్ సభ్యుడు మహమ్మద్ మోసిన్ అలీ, ఎంపిపి పుట్టల సునీత కృపయ్య, బిఆర్ఎస్ పార్టీ వేములపల్లి, మాడ్గులపల్లి మండలాల అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, స్థానిక సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, దైద జాన్సన్, ఉగ్గే మునీశ్వర్, నాగవెళ్లి శంకర్ లతోపాటు డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ పీసీసీ సభ్యుడు చిరుమర్రి కృష్ణయ్య, మాజీ సర్పంచులు మర్రి ఎలియాస్, నాగవెళ్లి మధు, బంటు చుక్కయ్య గౌడ్, అక్షిత దినపత్రిక ఎడిటర్, ఎంజేఎఫ్ జాతీయ అధ్యక్షుడు దాస్ మాతంగి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ సంపత్ , మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, మార్కెట్ కమిటి డైరెక్టర్లు గందే రాము, శ్రీనివాస్ రెడ్డి, కట్టా మల్లేష్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు ఇరుగు వెంకటయ్య, కాట్రగడ్డ రాజగోపాల్ రావు, సర్పంచ్ గోవిందరెడ్డి, షేక్ జావీద్, మాలి శంకర్ రెడ్డి, జడ రాములు యాదవ్, ఉప సర్పంచ్ అమిరెడ్డి శేఖర్ రెడ్డి, పుట్టల పౌల్, దుర్గారెడ్డి, జడ మట్టయ్య, మాజీ మార్కెట్ కమిటి డైరెక్టర్ పోలు నాగార్జున, నకిరేకంటి రాబర్ట్, పుట్టల సందీప్, తీరంశెట్టి కోటేశ్వర్ రావుతో పాటు వివిధపార్టీల నాయకులు ప్రజాసంఘాల ప్రతినిధులు పులామాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. సోమవారం నిర్వహించిన పుట్టల భాస్కర్ అంతిమ దహన సంస్కారాల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, స్థానిక సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్ పాడేమోసి భాస్కర్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వందలాదిమంది అభిమానుల అశ్రునయనాల నడుమ మండల కేంద్రంలో మూడు గంటలపాటు నిర్వహించిన అంతిమ యాత్ర సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్ఐ దాచేపల్లి విజయ్ కుమార్ చర్యలు చేపట్టారు. అనతరం వేములపల్లి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి సమాదుల తోట అంత్యక్రియలు జరిగాయి. పాస్టర్ మైదం ప్రేమ్ కుమార్, చర్చి అధ్యక్షుడు సిహెచ్ సామ్యేల్ జాన్సన్, కోశాధికారి దైద సాల్మన్ రాజు, జోసెఫ్ డానియేలు, పుట్టల ఇమ్మాన్యువల్, పుట్టల వజ్రమ్మ సామ్యేల్, నతానియేల్, గుడుగుట్ల సుందర్, దైద వెంకట రత్నం, ధర్మయ్య దైద తదితరులు పాల్గొన్నారు.