ప్రగతినగర్ లోని వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
వినాయక నవరాత్రులు పురస్కరించుకొని శేర్లింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్ ప్రగతి నగర్ లోని శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి డివిజన్ ఉపాధ్యక్షులు యెళ్ళం నాయుడు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ వినాయకుని చల్లని దీవెనలతో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు తిరుపతి, షణ్ముఖరావు, ఆంజనేయులు, సునీల్, బలరాం, ధర్మేందర్, రవి ,సంతోష్, నాగేంద్ర, బాబు, రామకృష్ణ,పీరయ్య,జీవా, వెంకటరావు, మహిళలు పార్వతి,లక్ష్మి, శాంతి,సౌజన్య, లావణ్య, ప్రమీల, పుష్ప, హిమావతి, రాణి, కాలనీవాసులు భక్తులు తదితరులు ఉన్నారు.