మిర్యాలగూడ జిల్లా సాధనకై మోకాళ్ళపై నిరసన

మిర్యాలగూడ జిల్లాగా మంత్రి కెటీఆర్ ప్రకటించాలని మోకాళ్లపై ఆందోళన
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ నియోజకవర్గం ను ప్రత్యేక నూతన జిల్లాగా బీఆర్ఎస్ తెలంగాణా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  ఈ నెల 10. వ తేదిన మిర్యాలగూడ పర్యటన సందర్బంగా మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలదరి కోరిక మేరకు ప్రత్యేక మిర్యాలగూడ జిల్లా గా ప్రకటించాలని కోరుతూ స్థానిక పట్టణంలో మినీ ట్యాంక్ బండ్, పందిర్లపల్లి చెరువు (బోటింగ్ ), వద్ద జిల్లా సాధన నాయకులు, యువకులు మోకాళ్ళపై నిల్చొని ప్ల కార్డ్స్ తో వినూత్నంగా నిరసన తెలపడం జరిగింది,,జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా ఇప్పటికైనా అన్నింట్లో ముందంజలో జిల్లాకు మించి అర్హత ఉన్నటువంటి మిర్యాలగూడను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ జిల్లా సాధన ఉద్యమ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేశారు. మొట్ట మొదటగా జిల్లాల్లో ఏర్పాటు కావలసిందన్నరు మిర్యాలగూడ నియోజకవర్గం ను తక్షణమే నూతన జిల్లా గా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసి ప్రకటించాలన్నారు చేయలేని పక్షంలో జిల్లా గా ఏర్పాటు అయ్యే దాక జిల్లా సాధన ఉద్యమం ఆగదన్నారు కార్యక్రమంలో ::దోనేటి అశోక్ కుమార్,కృష్ణబాబు, దాసరి వంశీ, అశోక్, మురళి, నానీ, రవితేజ,గౌతమ్, తేజ, మహేష్, మధు, నిఖిల్, లోకేష్,ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking