ప్రగతి నివేదన సభకు సర్వం సిద్దం

మంత్రి కెటీఆర్ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మేల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ పరిపాలన, ఐ.టి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ నెల 10న మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించి ఎన్‌ఎస్‌పీ క్యాంపు మైదానంలో ప్రగతి నివేదన సభలో ప్రసంగించనున్నారు.

ఈ నేపద్యంలో సభప్రాంగణాన్ని ఆదివారం శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, స్థానిక మునిసిపల్ చైర్మన్ పరిశీలించారు. ప్రాంగణంలో వేదిక నిర్మాణం, విఐపి గాలరీ, వేదికకు దారి, లైటింగ్, సౌండ్ సిస్టం సక్రమంగా చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆయన వెంట డిఎస్పీ పి. వెంకటగిరి, బిఆర్ఎస్ నాయకులు నల్లమోతు చైతన్య, నల్లమోతు సిద్ధార్థ, కౌన్సిలర్స్ ఉదయభాస్కర్, దుర్గా అమృతం సత్యం, నాయకులు సుబ్బారావులున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking