దోపిడీకి అడ్డాగా మారిన… నిఖిల్ మీసేవ ఆధార్ సెంటర్…

దోపిడీకి అడ్డాగా మారిన…
నిఖిల్ మీసేవ ఆధార్ సెంటర్…

ప్రశ్నించిన విలేకరుని నెట్టివేసి నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్న షాపు యజమాని కందుల సైదిరెడ్డి

దామరచర్ల, అక్షిత న్యూస్ :

ప్రజా అవసరాల నిమిత్తం ప్రభుత్వం నోటిఫికేషన్ వేసి మీసేవ, ఆధార్ సెంటర్ లను ఏర్పాటు చేయిస్తూ ప్రజల వారి అవసరాల ఆన్లైన్ విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొంత కమిషన్ ఇస్తూ ప్రజలకు స్వచ్ఛమైన సర్వీస్ అందించే విధంగా మీసేవలు ఆధార్ సెంటర్ లకు అనుమతులు మంజూరు చేస్తే, సామాన్య జనం వద్ద నేడు అవే మీసేవ, ఆధార్ సెంటర్ లు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్న సంఘటన దామరచర్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఓ విలేఖరి వెలుగులోకి తెచ్చి దోపిడి సంఘటనఫై అందించిన వివరాల ప్రకారం మంగళవారం మండల కేంద్రంలోని నిఖిల్ మీసేవ ఆధార్ సెంటర్లో ఆధార్ అప్డేట్ వెళ్లిన వ్యక్తి నుండి ఆధార్ పత్రానికి 5 రూపాయలు, ఆధార్ అప్డేట్ చేయాలంటే 100 రూపాయలు కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఇదేంటండి ఆధార్ అప్లికేషన్ ఉచితంగా ఇస్తారు కదా, ఆధార్ అప్డేట్ చేసినందుకు ప్రభుత్వ రుసుము 50 రూపాయలు ఉంటుంది దాంట్లోనే మీ కమిషన్ ఉంటుందని ప్రశ్నించారు. వెంటనే షాపు యజమాని కందుల సైదిరెడ్డి, తన సతీమణి కందుల ఉమా ఇరువురు విలేఖరి పోలేపల్లి ఉదయ్ కుమార్ ని బెదిరించి, మా దగ్గర ఇంతే తీసుకుంటాం, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వేం చేయలేవు రా అంటూ దుర్భాషలాడారు.

మీసేవ, ఆధార్ సెంటర్ ఒక కుటుంబానివి … ఆధార్ సెంటర్ యజమానులు, భార్య కందుల ఉమా పేరున, మీసేవ సెంటర్ను కుమారుడు కందుల నిఖిల్( కందుల సైదిరెడ్డి ) పేరున నడిపిస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఈ నిఖిల్ మీసేవ, ఆధార్ సెంటర్ లైసెన్సులు రద్దుచేసి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మండలంలో పలువురు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking