రూ.12లక్షల విలువైన 50కేజిల గంజాయి పట్టివేత

రూ.12లక్షల విలువైన
50కేజిల గంజాయి పట్టివేత

*డిఎస్పి వెంకటగిరి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

వాహన తనిఖీల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున డివిజన్లోని నాగార్జునసాగర్ సరిహద్దు వద్ద అక్రమంగా వాహనంలో తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటగిరి మంగళవారం తెలిపారు. మహారాష్ట్రకు చెందిన చౌదరి రుక్మిణి, చౌదరి ఉమాకాంత్, అర్భాజ్ ఖాన్ లు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలిలో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయిని కొనుగోలు చేసి, ఆర్టీసీ బస్సు ద్వారా మాచర్ల చేరుకొని, అక్కడినుండి హైదరాబాద్ వెళ్లే క్రమంలో నాగార్జున సాగర్ వద్ద పట్టుబడ్డారని గంజాయిని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ 12.5లక్షల ఉంటుందన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking