ఆయిల్ ఫాం తోటలకు ఉపాది హామి కూలీలను అనుసందానం చేయాలి
రైతు సంఘం ఆద్వర్యంలో జాయింట్ కలక్టర్ కు వినతి
నకిరేకల్ అక్షిత ప్రతినిధి:
ఆయిల్ ఫాం తోటలకు జాతీయ ఉపాధి హామి పథకాన్ని అనుసందానం చేసి ఆయిల్ ఫాం రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శుల మేక అశోక్ రెడ్డి,మాటూరి బాలరాజూ ప్రభూత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆద్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు,జిల్లా ఉద్యానవన అధికారికి వినతి పత్రం అందించి అనంతరం మాట్లాడుతు వరి కన్నా ఆయిల్ ఫాం తోటలతో రైతులకు అధిక ఆదాయం అని చెప్పటంతో ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని జిల్లాలో సుమారుగా 3వేల ఎకరాల ఆయిల్ ఫాం తోటలు పెట్టినారు. నాలుగు సంవత్సరాల తర్వాత పంట చేతికొస్తుంది. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో తోటలు పెంచడానికి ఎకరానికి సాగు ఖర్చులు దున్నకము,చెట్ల కలుపు తీయుట,ఎరువులు,పురుగు మందులు,వర్మీకంపోస్టు,కూలీలతో కలిపి నలబై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాని ప్రభుత్వం సాగు ఖర్చుల క్రింద 4200/- రూ.మాత్రమే ఇస్తుంది. ప్రభుత్వం ఇచ్చే సాగు ఖర్చులు సరిపోక రైతులు అప్పులపాలు కావాల్సివస్తుందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఆయిల్ ఫాం తోటలకు అనుసందానం చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. చెట్ల క్రింద కలుపు తీయడానికి ఉపాది హామి కూలీల ద్వారా పని చేయించాలి. సాగు ఖర్చులు ఎకరానికి 20 వేల రూపాయలు అందివ్వాలి.ఆయిల్ ఫాం రైతులకు మినీ ట్రాక్టర్లు90% సబ్సిడిపై అందివ్వాలి. బ్యాంకుల ద్వారా ఆయిల్ ఫాం తోటలకు ఎకరాకు 2లక్షల రూపాయలు అందివ్వాలా. ఉద్యానవన శాఖ అధికారి నెలకు ఒక సారి తోటలను పరిశీలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు గన్నెబోయిన విజయభాస్కర్ పాల్గొన్నారు.