తెలంగాణ బిసి కుల సంఘాల ముఖ్య నాయకుల సమావేశం
బీసీ సంఘాల నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి
తెలంగాణ బిసి సంఘాల జేఏసి చైర్మన్ మరియు బి.ఆర్.యస్. రాష్ట్ర నాయకులు ఓరుగంటి వెంకటేశం గౌడ్ ఆద్వర్యంలో బిసి కుల సంఘాల ముఖ్య నాయకుల సమావేశం లక్ష్మి కన్వెన్షన్ హాల్ లో కర్మన్ ఘట్ లో బుధవారం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిధిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు బి.ఆర్.ఎస్. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారి అభివృద్ధికై పాటు పడుతున్నదని ముఖ్యంగా బీసీలకు బిసి బందు ,ఆత్మగౌరవ భవనాలు, వృత్తి దారులకు పనిముట్ల క్రింద సహాయం ,విద్యార్థుల కోసం విదేశీవిద్య మెదలగు కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయకత్వంలో చేయడం జరుగుతుందని అన్నారు. అధే విధంగా ఎల్.బి.నగర్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించి సిగ్నల్ రహితంగా మార్చానని,118 జీవో తీసుకొచ్చి యు.ఎల్.సీ సమస్యలు పరిష్కరించానని, ఆస్తి పన్నులు తగ్గించానని, అదేవిధంగా ప్రూట్ మార్కెట్ ను తరలించి అట్టి స్థలంలో వెయ్యి పడకల ఆసుపత్రిని ఇరవై ఏడు అంతస్తులతో పన్నెండు వందల కోట్లతో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఇట్టి సమావేశానికి అద్యక్షతన వహించిన ఓరుగంటి వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ బిసిలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయించి కేంద్రం ప్రభుత్వానికి పంపినప్పటికి బిజెపి ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవడం సోచనీయమని అన్నారు. అదేవిధంగా నిత్యం ప్రజలకు అంధుభాటులో వుంటూ ఎల్.బి.నగర్ ను అభివృద్ధిప్రదంలో నడిపిస్తున్న సుధీర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ బి.ఆర్.యస్ రాష్ట్ర కార్యదర్శి కుంట్లూరు వెంకటేష్ గౌడ్ , నాయి బ్రహ్మాణ్డ సంఘం అద్యక్షులు రాచమల్ల బాలకృష్ణ, ముదిరాజ్ సంఘం కావలి నరసింహ ముదిరాజ్, డిల్లీ గోపాల్, కుమ్మరి సంఘం నాయకులు దూగుంట నరేష్, యాదవ సంఘం నాయకులు నారగోని శ్రీనివాస్ యాదవ్,సగర ఉప్పర సంఘం అద్యక్షులు అమరేందర్ సాగర్,పెరిక సంఘం జిల్లా అద్యక్షులు డాక్టర్ బొలిశెట్టి సతీష్ కుమార్ ,కుర్మ సంఘం నాయకులు నర్రె శ్రీనివాస్, గగిరెద్దుల సంఘం అద్యక్షులు నరసింహ, రజక సంఘం నాయకులు పగడాల ఎల్లన్న,బి.ఆర్.యస్ నాయకులు రాహుల్ గౌడ్, విజయ గౌడ్,జిల్లెల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.