బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలి

బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలి

రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని భారీగా చేరికలు.

నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.

ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరిన రామలక్ష్మీపురం గ్రామం కాంగ్రెస్ పార్టీ కి చెందిన 30 కుటుంబాలు.

కోదాడ అక్షిత ప్రతినిధి:

కోదాడ మండల పార్టీ కార్యాలయంలో మండల పరిధిలోని రామలక్ష్మీపురం గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ కి చెందిన 30 కుటుంబాలు ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవితా రాదారెడ్డి వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకిఆహ్వానించారు.అనంతరం వారు మాట్లాడుతూ అధినేత సీఎం కేసీఆర్ పాలనా దక్షత, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారీగ టిఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని నాయకత్వ లేమితో ప్రతిపక్షాలు అయోమయ స్థితిలో ఉన్నాయని సీఎం కేసీఆర్ , ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నాయకత్వంలో పని చేయడానికి బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములు కావడానికి ఉత్సాహం చూపిస్తున్నారని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం, నియోజకవర్గానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నాయకత్వం అవసరమని భావించి బిఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారని, సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అని అతిత్వరలోనే ప్రతిపక్ష పార్టీలు ఖాళీ అవుతాయని అన్నారు. కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పని చేసి ముచ్చటగా మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ని గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాముల మస్తాన్,మండల యూత్ అధ్యక్షుడు అన్నెం వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ అన్నెం బుచ్చమ్మ వెంకట్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు అన్నెం పెద్ద అంజిరెడ్డి,మాజీ సర్పంచ్ బెల్లంకొండ బ్రహ్మం, గ్రామశాఖ అధ్యక్షులు అన్నెం అంజి రెడ్డి,రమేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking