ఎమ్మెల్యే అండగా ప్రభుత్వ భూములు కబ్జా అయిపోయాయ్ ఇక మిగిలింది ప్రైవేట్ భూములే…నల్గగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎమ్మెల్యే అండగా ప్రభుత్వ భూములు కబ్జా అయిపోయాయ్ ఇక మిగిలింది ప్రైవేట్ భూములే…నల్గగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
దోపిడీ విధానాలను, పోలీస్ స్టేషన్ రాజకీయాలను అంతమొందించేందుకు ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నా
నేరేడుచర్ల, అక్షిత న్యూస్:-
నియోజక వర్గంలో పోలీస్ వ్యవస్థని, కబ్జా దారులను అడ్డం పెట్టుకొని సామాన్య ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురిచేసే విధంగా బీఆర్ఎస్ రాజకీయ వ్యవస్థ ఉందని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నాడు వంద మంది బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ నవంబర్ 30న ఎన్నికలు వస్తాయని ముందే చెప్పానని,రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుంది, నియోజకవర్గంలో దోపిడి విధానాలను, పోలీస్ స్టేషన్ రాజకీయాలను అంతమొందించడానికే మళ్ళీ హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వ భూముల కబ్జాదారులకే ఎమ్మెల్యే అండగా ఉన్నాడని, నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థని, కబ్జాదారును అడ్డం పెట్టుకొని సామాన్య ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా బీఆర్ఎస్ రాజకీయ వ్యవస్థ ఉందని, హుజూర్ నగర్ లో మొత్తం ప్రభుత్వ భూములు కబ్జా అయిపోయాయని ఇక ప్రైవేటు భూములే దొంగలించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ రాష్ట్రం నుండి ప్రజల పీడిత రాజకీయ దోపిడీ దొంగల ముఠాను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు, బీసీ బందు,మైనారిటీ బందు,దళిత బంధు, గృహలక్ష్మి, ఇతర పథకాల పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, ప్రజలను మోసం చేసి దోచుకోవడం,దాచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. పోలీసులతో రాజకీయం చేస్తున్నారని,తప్పుడు కేసులు పెట్టి సామాన్యులను జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. డెవలప్మెంట్ పేరుతో కమిషన్లు తీసుకుంటున్నారని, బిఆర్ఎస్ చేస్తున్న మోసాలను గుర్తించి ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారని, రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి,పట్టణ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు,నేరేడుచర్ల, పాలకవీడు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.