బేకరీ ఉత్పత్తులపై శిక్షణా తరగతులు.
గరిడేపల్లి అక్షిత న్యూస్.
ఈ రోజు కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లిలో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసర్చ్ మేనేజ్‌మెంట్ (నారమ్) – హైదరాబాద్ వారి ఆర్థిక సహాయంతో షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళికలో భాగంగా చిరుదాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారి పై మహిళలకు నిర్వహిస్తున్న 6 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా 5 వ రోజు బేకరి ఉత్పత్తుల తయారీ విధానం పై హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ సందర్శించిన యువతులు, మహిళలకు మిలెట్స్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, సీలింగ్ లేబుల్ పై ఇంచార్జీ శ్రీమతి ప్రదీప్ అవగాహన కల్పించారు.
కృషి విజ్ఞాన కేంద్రం, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి ఎన్. సుగంధి మహిళలు తయారు చేసిన బేకరి ఉత్పత్తులను పరిశీలించి ప్రతి ఒక్కరూ చిరు ధాన్యాలతో బేకరి ఉత్పత్తులు భాగం అయినందున చిరుధాన్యాలతో వివిధ వంటకాలు చేసుకుని తినటం ద్వారా మంచి పోషక ఆహారం తో పాటుగా స్వయం ఉపాధిగా కూడా పొందవచ్చని తెలియజేశారు. బేకరి ప్రొడక్ట్స్ అయిన కేక్, బిస్కెట్స్ లను తయారు చేసి చూపించారు . ఈ కార్యక్రమంలో చిరుధాన్యాల తో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారీ చేసుకొని మార్కెటింగ్ చేపట్టడం ద్వారా యువతులు స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కే వికే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి ఎన్. సుగంధి మరియు 25 మంది యువతులు పాల్గొన్నారు.