ధర్మపురి మళ్లీ గులాబీదే !!

ధర్మపురి మళ్లీ గులాబీదే…

ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టిన మంత్రి కొప్పుల ఈశ్వర్

కొప్పుల ఈశ్వరన్నను మళ్ళీ గెలిపించుకుంటాం

ధర్మపురి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు హామీ

పార్టీ శ్రేణులను ఆప్యాయతతో పలుకరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

ధర్మపురి, అక్షిత ప్రతినిధి :

ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ ను త్వరలో జరగనున్న ఎన్నికల్లో మరోసారి భారీ మెజారిటీ తో గెలిపించు కుంటామని నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో హామీ ఇచ్చారు.


ధర్మపురిలో బుధవారం నాడు మంత్రి కొప్పుల ఈశ్వర్ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టారు. ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మి నర్సింహ స్వామి ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ, ప్రజా ప్రతి నిధులు, నాయకుల సమన్వయ సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మున్సిపల్ ఛైర్మన్, ఏడు మండలాల జెడ్పీటీసీలు, యంపిపిలు, యంపిటిసి లు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, సింగిల్ విండో చైర్మన్ లు, పార్టీ మండల అధ్యక్షులు,మండల, గ్రామ, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, రైతు బంధు సమితి సభ్యులు, కో ఆప్షన్ లు, యూత్, మహిళ ఆర్గనైజేషన్ సభ్యులు, క్లస్టర్, లీగల్, అడ్వైజరీ సభ్యులు పాల్గొన్నారు. నియోజక వర్గానికి గడిచిన పదేళ్ళ కాలంలో చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పధకాలే ప్రజలు మరోసారి బీఆరెఎస్ కు పట్టం కట్టెందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ శ్రేణులు చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్ని హామీలు ఇచ్చిన నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. సమావేశంలో పాల్గొన్న పార్టీ శ్రేణులను మంత్రి పేరుపేరునా ఆప్యాయత తో పలుకరించి.. పార్టీ విజయానికి గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేపట్టాలని మంత్రి కొప్పుల కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking