వివక్షత లేని సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలి.
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఉపేందర్ రావు వరంగల్ ,అక్షిత బ్యూరో :
వరంగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అభ్యుదయ సేవా సమితి వరంగల్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలో దూబకుంట రోడ్ నందు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షురాలుగా కళాశాల ప్రిన్సిపాల్ నీలిమాదేవి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ ఉపేందర్ రావు హాజరై మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిలను అబ్బాయిలను వివక్షత లేకుండా అన్ని రంగాలలో రాణించడానికి సమాన అవకాశాలు కల్పించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న విద్య అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకొని శాస్త్రీయమైన విజ్ఞానం వైపు పయనించి అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించి సమాజంలో మార్పు తీసుకురావాలని విద్యార్థులు చెడుకు దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలని తెలిపినారు. కార్యక్రమం లో అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు మండల పరషరాములు జిల్లా ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్ అనిల్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ నీలిమ దేవి, ఆఫ్రిన్ సుల్తానా, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది 390 మంది బాలికలు పాల్గొన్నారు,