జోనల్ స్థాయి క్రీడాపోటిలకు సర్వం సిద్దం
అక్షిత న్యూస్, రాయపర్తి:
సాంఘిక సంక్షేమ పాఠశాలల 9వ జోనల్ స్థాయి క్రీడా పోటీలకు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్సీఓ సూరినేని విద్యారాణి తెలిపారు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జోనల్ స్థాయిలోని 14 పాఠశాలల నుంచి దాదాపుగా 1100 మంది విద్యార్థులు వివిధ క్రీడాంశాలలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ సమ్మయ్య, రాయపర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్, పీడి ప్రభావతి, కళమ్మ, ఉపాధ్యాయులు దేవి ప్రసాద్, అనిత, గాయత్రి, ఝాన్సీ, స్రవంతి, నాజియా తదితరులు పాల్గొన్నారు.