“మిర్యాల”లో 263 పోలింగ్ కేంద్రాలు…

“మిర్యాల”లో 263 పోలింగ్ కేంద్రాలు

ఆర్డీఓ, ఆర్ఓ చెన్నయ్య
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ శాసనసభ నియజకవర్గంలో అక్టోబర్ 4 నాటికి మొత్తం 2,25,626 మంది ఓటర్లున్నారని మిర్యాలగూడ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్, ఆర్డీఓ బి. చెన్నయ్య తెలిపారు. బుధవారం స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1,11,169 మంది పురుషులు కాగా 1,14, 434మంది మహిళలు, 23 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారని అన్నారు. నవంబర్ 30న జరిగే పోలింగ్ కోసం 263 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో కనీస సౌకర్యాలు తాగు నీరు, మరుగు దొడ్లు, విద్యుత్, ప్రథమ చికిత్స, దివ్యాంగులకు రాంప్, వీల్ చైర్ సౌకర్యం కల్పించనున్నామని ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి ఎన్నకల కోడ్ అమలు చేసేందుకు ఎంసీసీ, ఎస్ఎఫ్సి, విసి. అకౌంటింగ్ బృందాలు 9 ఏర్పాటు చేశామన్నారు. ఆ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీుకుంటున్నామని
ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా రూ.50వేల కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకెళ్లే సమయంలో ఎందుకు అనే విషయాన్ని ఆధారాలతో చూపాలని, జిల్లా కోశాధికారికి అప్పగిస్తామని తర్వాత నైనా ఆధారాలు సమర్పించి డబ్బులు తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం అఖిల పక్ష సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ హరిబాబు, డిప్యూటీ తహశీల్దార్లు కల్పన, రామకృష్ణ, ఎస్ఎ జానీ పాషా, మునిసిపల్ చైర్మన్ తిరునాగరు భార్గవ్, బిఆర్ఎస్ నాయకులు నల్లమోతు చైతన్య, మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తలకోప్పుల సైదులు, సిపిఎం నాయకులు. డి. మల్లేష్, బిజెపి అసెంబ్లీ కన్వీనర్
బి. రతన్ సింగ్ నాయక్, పట్టణ అధ్యక్షుడు డి.వెంకట్ రెడ్డి, ఏఐఎంఐఎం జిల్లా సహాయ కార్యదర్శి సయ్యద్ ఫరూక్, లన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking