హోంగార్డ్ స్మృతికి మహిళా చేపల విక్రేతలు ఫ్యాన్లు అందించిన హోంగార్డ్ యూనియన్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
హోం గార్డ్ లింగయ్య కుమారుని తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడిని మరచిపోలేక అతని జ్ఞాపకార్థం బుధవారం రైతు బజార్ లోని చేపల కంపౌండ్లో మహిళలు పడుతున్న బాధలు చూడలేక లవకుమార్ పేరు మీద మిర్యాలగూడ పట్టణములో చేపల మార్కెట్ లో మహిళలు పడుతున్న బాధలకు మనసు కరిగిపోయి రెండు సీలింగ్ ఫ్యాన్స్ బహూకరించారు. మిర్యాలగూడ హోం గార్డ్ డివిజన్ అధ్యక్షుడు కోడిరెక్క. కిరణ్ మాట్లాడుతూ తమ కుమారుడు మరణించిన ప్రజల హృదయాల్లో నిలిచి పోవాలని కార్యక్రమం చెపట్టడం జరిగిందని అందరికీ అదర్శనీయమన్నారు. పోలీస్ అంటే ప్రజల రక్షణే కాదు మానవ సేవ కూడా చేస్తామని ప్రజలతో పాటు అన్ని విధాల చేయూత అన్నివేళలా చేతనైనంత సహాయం చేస్తామని మిర్యాలగూడ హోం గార్డ్స్ యూనియన్ చేపడుతునదని కొనియాడారు. సహయం చేయటానికి ముందుకు వచ్చిన లింగయ్య కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా రైతు బజార్ మహిళలు హోం గార్డ్స్ చేస్తున్న సేవలను అభినందించారు. వనం వెంకట్, పల్లె వేంకట్, నరసింహ మధు, కొండల్, మురళి, సైదులు, అక్రం, మురళి, లాజర్ లు లింగయ్య కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు.