బాల్య వివాహ రహిత భారత్ ! ! !

బాల్య వివాహ రహిత భారత్

ప్రతిజ్ఞ చేయించిన ఐసిడిఎస్
పీఓ మమత
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక గాందీ నగర్ సెక్టార్ పాపాస్ దిబ్బ అంగన్వాడీ కేంద్రంలో బాల్య వివాహ రహిత భారత్ ను నిర్మిద్దాం అని మిర్యాలగూడ ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్. మమత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలకు 18 సంవత్సరాలు నిండిన అనంతరం వివాహం చేయాలని, 18 సంవత్సరాల లోపు చేస్తే శిక్ష అర్హులు అవుతారని ఆమె అన్నారు. అంగన్వాడీ నుండి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలని కోరారు. ఆడపిల్లల చట్టాల గురించి వివరించారు. ఆడపిల్లలు అమ్ముకోవద్దని వారిని చదివించాలని ప్రభుత్వ 6సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రేవతి, అంగన్వాడీ టీచర్ అరుణ. ఆయా లక్ష్మీకాంతమ్మ పిల్లలు, తల్లులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking