డబుల్ ఇంజన్ సర్కార్ తో మేలు !!!

డబుల్ ఇంజన్ సర్కార్ తో మేలు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

పిఎం ఫసల్ భీమా యోజన అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలంమైందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభ కరండ్లజే ఆరోపించారు. బుధవారం స్థానిక బృందావన్ గార్డెన్స్ లో విలేఖరులతో మాట్లాడుతూ అతివృష్టి, అనావృష్టిలో రైతుకు ప్రయోజనకరంగా ఉన్న భీమా యోజన అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం దేనని అయితే ఈ యోజన అమలు చేయకుండా తాత్సారం చేయడం జరిగిందని ఆరోపించారు. కేంద్రం వంద లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇవ్వగా ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పథకాల పేర్లు మార్చి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగణ సిఎం ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రధాని వచ్చిన రారని, సెక్రటేరియట్ కు వెళ్లరని నిత్యం కేంద్రంతో గొడవ పడతారని, ఇలాంటి సిఎం ను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలన్నారు.

మిర్యాలగూడ నియోకవర్గంలో బిజెపి అభర్డిని గెలిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభ కరం ధ్లాజే అన్నారు. మిర్యాలగూడ శాసనసభ బిజెపి అభ్యర్థిని జరగబోయే ఎన్నికలలో గెలిపించుటకు పాటుపడాలని కోరారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు కంకణాలు శ్రీధరరెడ్డి, కిసాన్ మోర్ఛ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోలీ మధుసూధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రెపాల పురుషోత్తం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు డి.వెంకట్ రెడ్డి, ఎపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షులు సరిత, మిర్యాలగూడ నియోజకవర్గం పార్టీ, వివిధ మోర్చాల, రాష్ట్ర, జిల్లా, నాయకులు, మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మండలాల పార్టీ ముఖ్యనాయకులు, మోర్చల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు,శక్తి కేంద్ర ఇన్చార్జిలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking