గ్రేట్ వే స్కూల్ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

గ్రేట్ వే స్కూల్ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

అక్షిత, తిరుమలగిరి (సాగర్) :

తిరుమలగిరి మండల కేంద్రం లో ఈ రోజున శ్రీ చైతన్య & గ్రేట్ వే విద్యాసంస్థల లో ఘనంగా బతుకమ్మ ముందస్తు వేడుకలు మరియు FA-ll ఫలితాల్లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక యస్ ఐ.సురేష్ పాల్గొని FA-ll ఎగ్జామ్ లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా యస్ ఐ.సురేష్ మాట్లాడుతూ, విద్యార్థులు మంచి లక్ష్యం పెట్టుకోని చదువులో రాణించాలి అని సూచించారు.విద్యార్థులు చిన్న వయస్సు లో మొబైల్ వాడటం మంచిది కాదని చెప్పారు. అదే విధంగా ముందస్తు బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న చిన్నారుల కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రహ్మచారి,ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి,శ్రీనివాస, నాగయ్య, శ్యాం సుందర్ రెడ్డి,వెంకన్న, బషీర్, ఆంజనేయులు,నరేష్,మంజుల, మోక్ష, సరిత,శోభారాణి, లక్ష్మి, మాధవి, జమీన, శ్రీలత,కల్పన, తన్విర్, సఫియా, తదితరులు పాల్గొన్నారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking