బిజెపి టిక్కెట్ రేసులో నోముల దయానంద్ గౌడ్.

 బిజెపి టిక్కెట్ రేసులో నోముల దయానంద్ గౌడ్.

 

మలుపులు తిరుగుతున్న బిజెపి టికెట్ వ్యవహారం. లోకల్ అభ్యర్థిగా బిజెపి పార్టీకి దయానంద్ సేవ.

రంగా రెడ్డి అక్షిత ప్రతినిధి:

ఇబ్రహీంపట్నం భారతీయ జనతా పార్టీ టిక్కెట్ వ్యవహారం రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సిగ్మెంట్ బిజెపి టికెట్ కు సంబంధించి రేసులో ఇంజాపూర్ గ్రామానికి సీనియర్ నేత బిజెపి నోముల దయానంద్ గౌడ్ఎంతో ముందున్నారు. పైగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి స్థానికుడు కావడంతో దయానందుకు టికెట్ వస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి. ఆయనకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంచిపట్టు ఉంది, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఇప్పటికే నోముల దయానంద్ గౌడ్ సర్వం సిద్ధం చేసుకున్నాడు. నియోజకవర్గమంతా బిజెపి పేరుతో దయనంద్ ఇంటింటి ప్రచారం కూడా కొనసాగుతుంది. ఎలాగైనా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ భారతీయ జనతా పార్టీ నుండి కేటాయించాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనను బీసీ అభ్యర్థులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో బీసీ నాయకుడిగా తనకు గెలుపు సునాయాసం అవుతుందని బీసీల గొంతుకగా ఉండి భారతీయ జనతా పార్టీని ఇబ్రహీంపట్నం గడ్డపై విజయ డెంకా మోగిస్తామని అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిగా బిజెపి గెలుపుకు ద్రోహదా పడుతుందని స్థానికులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking