ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కి పూర్తి మద్దతు

ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కి పూర్తి మద్దతు

-డా.ఏ.ఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి.

తార్నాక, అక్షిత ప్రతినిధి:

డా.ఏ.ఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పజూరి పావని మణిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులతో కలసి గురువారం తన నివాసంలో ఆత్మీయ సమ్మేళనాన్ని సుమారు 600 మంది కార్యకర్తలతో కలసి నిర్వహించరు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి కి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.గత నాలుగు రోజులుగా తాను స్థానికంగా లేకపోవడం వల్ల ఇటీవల జరిగిన కార్యక్రమాల్లో తాను పాల్గొనలేకపోయానని వివరించారు. తాను బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నామని, పార్టీని వీడే ప్రసక్తే లేదని అన్నారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపునకు తాను శక్తివంచన లేకుండా కృషి చేసి వారిని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో జూనియర్ కాలేజీ తో పాటు డిగ్రీ కాలేజీ రావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు, కార్యకర్తలను కంటికి రెప్పలాగా కాపాడుకొంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎమ్మెల్యే వుచ్డిడి మోహన్ రెడ్డి, తాడూరి శ్రీనివాస్,మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, బేతాళ బాలరాజు,దత్తు,బండారు నీలం రెడ్డి,రాజేందర్ రెడ్డి, వంజరి ప్రవీణ్,మల్లేష్ వంశరాజ్,పెంచాల సురేందర్రావు,చిందం బాల నరసింహ, సింగం రాజు, యాకయ్య,రాజిరెడ్డి,సురేందర్ చారి, నాగేశ్వర్ రెడ్డి,నరసింహ, పొద్దుటూరు గోవర్ధన్, మొగులయ్య,జనార్ధన్,గోవర్ధన చారి,సదానంద చారి,ఈసిఎల్ బాలరాజు, సింగారపు రాజు, చిన్నారావు, సాయి కిరన్, మాడ వెంకట్రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, లక్కాకుల రాజేశ్వరరావు, దశరథం, సత్యనారాయణ, శ్యామల శంకర్, రాజేశ్వరరావు, ఉమేష్ చారి, మహిళా నాయకురాలు మన్నెమ్మ రజిత రెడ్డి రాజేశ్వరి యశోద, మీర, రాష్ట్ర తెలంగాణ సోషల్ మీడియా సభ్యులు తిరుమందాస్ నరేష్, బత్తిని వినయ్, రాజేష్ చామకూర, రాజు గౌడ్, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking