నన్ను ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా

నన్ను ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా

*ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి

*ప్రజా నాయకుడై వస్తున్న గడప గడపకు వస్తున్న ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి.
* మీ సేవకై వస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

కొడంగల్, అక్షిత ప్రతినిధి :

కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం పెద్దాపురం గ్రామంలో కొడంగల్ నియోజకవర్గం జోర్ జోర్ జోరుగా హోరేపిస్తున్న ఇంటింటి గులాబీ శ్రేణులు ప్రచారం సాగుతుంది.బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం నిదర్శనం అని అన్నారు. కేసీఆర్ గారి నేతృత్వంలో ఏ వర్గానికి విస్మరించకుండా సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని సమానత్వం,సమ్మిళిత తత్వం ఆత్మ గౌరవాన్ని జీవనం అనే ప్రాతామిక విలువలె పునాదిగా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని అన్నారు.సంపద పెంచాలి -ప్రజలకు పంచాలే అనే నినాదంతో సంక్షేమ పథకాలు అభివృద్ధి కి సమాన ప్రాధన్యత ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ఘనత అని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో లో ప్రతి ఇంటికి ఇచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావాలని పిలుపునిచ్చారు.
అసరా పెన్షన్లు 2016 రూ/ నుండి 5016రూ/ వరకు పెంచారాని, తెలిపారు. దివ్యంగులకు 4016 నుండి 6000/- వేల వరకు పెన్షన్లు పెంచిన ఘనత ఒక్క బిఆర్ఎస్ పార్టీ కే చెందిందని అన్నారు. ఈసారి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.ఇంటింటికి బిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్న వివరాలు వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో తెల్ల కార్డు కలిగిన ప్రతి ఇంటికి రైతు భీమా తరహాలోనే ఎస్.ఐ. సి.ద్వారా రూపాయలు 5 లక్షల జీవిత భీమా కల్పిస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన 100% ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. అలాగే కేసీఆర్ మనివియా కోణంతో అర్హులైన పేదలకు 400/రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు యువకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking