ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామ పద్మశాలి కుటుంబానికి చెందిన వనం లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మృతి చెందడంతో వెల్లంకి సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. లక్ష్మీనారాయణ కుటుంబ సబ్యులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేశారు. అలాగే లక్ష్మీనారాయణ కుటుంబానికి ఇడం స్వరూప స్మారక సేవా సంస్థ అధ్యక్షులు ఈడెం శ్రీనివాస్ 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వనం సత్తయ్య, వనం ఉపేందర్ ,తలారి నరసింహ, వరికుప్పల భాస్కర్, పాశం సతీష్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.