పారిశుద్ధ్య కార్మికుల సిబ్బందికి బట్టలు పంపిణి
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సిబ్బందికి దసరా పండగ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇడెం స్వరూప స్మారక సేవా సంస్థ తరఫున ఇడెం రాధ- శ్రీనివాస్ దంపతులు సిబ్బందికి ఒక్కొక్కరికి రెండు జతల నూతన వస్త్రాలు చొప్పున పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నకిరెకంటి ఎల్లయ్య మరియు తలారి నరసింహ, పిట్ట మహేందర్ రెడ్డి మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు