కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు
అవమానాలు భరించలేక పార్టీ వీడాం
ఎంపీ ఉత్తమ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి, ముత్తవరపు ,మహబూబ్ జానీ,యర్నేని
కోదాడ, అక్షిత ప్రతినిధి :
కోదాడ పట్టణంలోని డేగబాబు ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు తో పాటు టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని బాబు డిసిసిబి మాజీ చైర్మన్ ముత్తువరపు పాండురంగారావు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహబూబ్ జానీ సుధారాణిపుల్లారెడ్డి జడ్పిటిసిలు శిరీష నాగేంద్రబాబు,ఉమా శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ పద్మ గుండపు నేని నాగేశ్వరరావు,మాజీ జెడ్పి కో. ఆప్షన్ అల్తాఫ్ హుస్సేన్ శాంతినగర్ మాజీ సర్పంచ్ స్వరూప తో పాటు ఎంపీపీలతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

కోదాడ టిఆర్ఎస్ నాయకత్వంలో నాయకులకు, కార్యకర్తలకు స్వేచ్ఛ స్వతంత్రాలు లేవని గత ఐదేళ్లుగా అడుగడుగున అవమానాలకు గురై తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు. కోదాడ టిఆర్ఎస్ అభ్యర్థి ఓటమి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ సీనియర్ నాయకులు కాంగ్రెస్లో చేరటం శుభపరిణామని అందరికీ తగిన గుర్తింపు ఇస్తామన్నారు.

కాగా కోదాడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి టిపిసి సి రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, పట్టణాధ్యక్షుడు వంగవీటి రామారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు అభిమానులు పాల్గొన్నారు