ఊరూరా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
వేములపల్లి, అక్షితప్రతినిధి :
వేములపల్లి మండలంలో ఊరూరా ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. పోయి రావమ్మా బతుకమ్మ పోయిరావమ్మ అంటూ పాటలుపాడిబతుకమ్మలకు వీడ్కోలు పలికారు. వేములపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హరిజన వాడ ,మొల్కపట్నం రామాలయం, తదితర గ్రామాలలో బతుకమ్మ వేడుకలు ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి. గ్రామాల్లో ఎర్పాటు చేసిన మైదానానికి మహిళలు రకరకాల పూలతో అలంకరించిన బతుకమ్మలతో మైదానానికి చేరుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ వేడుకలలో పాల్గొని బతుకమ్మ పండుగ గొప్పదనం గుర్తంచేస్తు ఆటాపాటాలతోఅలరించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి పుట్టల సునిత కృపయ్య , వైస్ ఎంపిపి పాదూరి గోవర్దని శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నామిరెడ్డి రవీణ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.