విజయానికి చిహ్నం …విజయ దశమి

విజయాలను అందించే
విజయ దశమి

మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు

ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని ఆయన అన్నారు. దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పదన్నారు. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్-బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని భాస్కర్ రావు అన్నారు. అనతికాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన, దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ స్పూర్తితో దేశం ప్రగతిబాటలో నడువాలని ఆకాంక్షించారు. విజయ దశమి స్ఫూర్తి ని కొనసాగిస్తామని అన్నారు. ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని దసరా సందర్భంగా భాస్కర్ రావు కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి పథంలో నడిపిస్తున్నారని, రానున్న దసరా లోపు తెలంగాణ రాష్ట్రం మరెన్నో అబ్బురపరిచే అద్భుత విజయాలను సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking