విజయ కాంక్షలకు ప్రతిరూపం.. దసరా

మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు
నల్లమోతు సిద్దార్ధ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని ఆయన అన్నారు. దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పదన్నారు. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్-బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని అన్నారు. అనతికాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన, దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ స్పూర్తితో దేశం ప్రగతిబాటలో నడువాలని ఆకాంక్షించారు. విజయ దశమి స్ఫూర్తి ని కొనసాగిస్తామని అన్నారు. ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని దసరా సందర్భంగా సిద్దార్ధ కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి పథంలో నడిపిస్తున్నారని, రానున్న దసరా లోపు తెలంగాణ రాష్ట్రం మరెన్నో అబ్బురపరిచే అద్భుత విజయాలను సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు బంగారు బాటలు వేస్తున్నారని తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రగతి రథ చక్రాలు నిర్విఘ్నంగా ముందుకెళ్లాలంటే వచ్చే నెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాస్కర్ రావును బంపర్ మెజారిటీతో గెలిపించాలని మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలను నల్లమోతు సిద్దార్థ విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking