సీఎం కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు
చేర్యాల,అక్టోబర్ 22 అక్షిత ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవసారి గెలవాలని కోరుతూ, చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో భవాని రుద్దేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం దుర్గామాత నవరాత్రుల్లో భాగంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఉల్లెగల సేవా ట్రస్ట్ చైర్మన్ ఉల్లెంగల ఏకానందం పద్మ (దేవి అమ్మవారికి) ప్రత్యేక పూజలు మరియు హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏకానందం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని మరియు జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుతూ ఈ హోమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి తాటికొండ వేణుగోపాల్, ఏఎంసి డైరెక్టర్ టి సదానందం, మరియు సీనియర్ నాయకుడు కాలువల రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.