జయ జయ ద్వానాలతో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నినాదాలతో…

కంచర్ల కు బ్రహ్మరథం పట్టారు… పూలమాలలతో… విజయ తిలకం దిద్ది మంగళహారతులు పట్టారు
జయ జయ ద్వానాలతో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నినాదాలతో…

అక్షిత న్యూస్ నల్గొండ / మాడుగులపల్లి:
డప్పుల మోతలతో కోలాట విన్యాసాలతో వీధి వీధిన భారీ ర్యాలీతో ప్రజలకు అభివందనం చేస్తూ కదిలి వస్తున్న కంచర్లకు
తమ ఇండ్ల పై నుండి ప్రజలు చేతులు ఊపుతూ మద్దతు ప్రకటించారు ఆయా వార్డుల్లో జరిగిన సభలలో కంచర్ల తనదైన శైలిలో ప్రజలకు అర్థమయ్యేలా మేనిఫెస్టోలోని అంశాలను వివరించి వారి మద్దతు కోరారు ఆసరా పెన్షన్లు 3016 నుండి 5016లో పెంచడం వికలాంగుల పెన్షన్ 6016కు, రైతుబంధు 12000 నుంచి 16 వేలకు, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అర్హులైన మహిళలకు 3000 రూపాయల భృతి ఇలా మేనిఫెస్టోలో అంశాలను క్షుణ్ణంగా వివరించారు 1350 కోట్లతో నల్లగొండ నందనవనంగా మారుస్తున్నామని మరో రెండేళ్లలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవుతాయని ఎందుకు మరోసారి కారు గుర్తుపై ఓటు వేసి నల్లగొండ అభివృద్ధికి దోహదపడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు నల్లగొండ అభివృద్ధి నిరోధించే కోమటిరెడ్డి ముఠాకు నల్లగొండ నియోజకవర్గం ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా వారిని ఓడించి బి ఆర్ ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైది రెడ్డి, కౌన్సిలర్ మారగోని నవీన్ గౌడ్, సైదులు గౌడ్, అంజయ్య ఉపేందర్, వజ్జే శ్రీను తదితరులు వెంట ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking