కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేస్తున్న వైటిడిఏ వైస్ చైర్మన్

సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేస్తున్న వైటిడిఏ వైస్ చైర్మన్

కలియుగ వైకుంఠంలా యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి

వై టి డి ఏ అధికారుల తీరు వల్లే సీఎం సంకల్పానికి నష్టం

◾ సరైన అవగాహన స్పష్టత లేకుండా పనుల కేటాయింపు

వైటిడిఎ లో రిటైర్డ్ అధికారులను నియమించడం వల్ల ఈ దుస్థితి

సీఎం కేసీఆర్ కు, ప్రభుత్వానికి మచ్చ తీసుకువచ్చేలా వైటిడిఏ వైస్ చైర్మన్ వ్యవహార శైలి

ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలో పెద్ద ఎత్తున టెంట్లు వేసుకుని ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్న స్థానిక కాంట్రాక్టర్లు

యాదాద్రి, అక్షిత ప్రతినిధి :

సీఎం కేసీఆర్ కృషితో ఆయన సంకల్పంతో యాదాద్రి దేవస్థానాన్ని పెద్ద ఎత్తున నిర్మించారు సీఎం యాదాద్రి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడంతో యాదాద్రి జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు జిల్లాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది అక్కడి ప్రాంతాల్లో చుట్టుపక్కల భూముల రేట్లు అమాంతం పెరిగాయి దీంతో ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగయింది కానీ వైటిడి అధికారుల తీరు వల్ల వారు చేసిన లోటుపాట్ల వల్ల దేవస్థానానికి,కాంట్రాక్ చేసిన కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది యాదాద్రి అభివృద్ధిలో భాగంగా భూములు కోల్పోయిన వారికి సరైన ఉపాధి చూపడంలో వారికి పునరావసం కల్పించడం విఫలమయ్యారు.


వైస్ చైర్మన్ ఇక్కడ అందుబాటులో ఉండకపోవడం యాదాద్రిలో వైటిడిఏకు కార్యాలయం లేకపోవడం వల్ల స్థానికులకు స్థానిక కాంట్రాక్టర్లకు తీవ్రమైన అన్యాయం నష్టం జరిగింది సుమారు 2500 ఎకరాల్లో 1300 కోట్ల రూపాయలతో నాలుగు భాగాలుగా యాదాద్రి అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగింది దీనికి సీఎం కేసీఆర్ కృషి సంకల్పం వల్లే ఇదంతా సహకారం అయింది కానీ వైటిడిఏ వైస్ చైర్మన్ అధికారులు కార్యాలయం యదగిరిగుట్టలో ఏర్పాటు చేసుకోకుండా హైదరాబాదులో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇక్కడి స్థానిక పరిస్థితులను అవగాహన చేసుకోకుండా పనులను కేటాయించడం వల్ల అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి
వై టి డి ఏ కార్యాలయంలో రిటైర్డ్ అధికారులను వైటిడి అధికారులుగా నియమించడం వల్ల ఇదంతా జరుగుతుందని పలువురు భావిస్తున్నారు ప్రధానంగా రిటైర్డ్ అధికారులు ప్రస్తుతం ఉన్న సాంకేతికతను అందిపుచ్చుకోకపోవడం వల్లనే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కాకపోవడం వలన అనేక రకాల లోపాలు జరుగుతున్నాయని పలువురు అంటున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్టర్లు యువకులు ఆధునిక భావాలు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన వారు కానీ వైటిడిఎలో రిటైర్డ్ అధికారులు ఉండటం వల్ల వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై సరియైన అవగాహన లేక ముందు ఒక నిర్మాణం చేయమనడం మళ్ళీ దానిని కూల్చివేయించి మరో నిర్మాణం చేయమని చెప్పడం వల్ల అనేక రకాలుగా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది.


దీనివల్ల యాదాద్రి దేవస్థానం నిధులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. నిత్య అన్నదాన సత్రం నిర్మించి దేవాదాయ శాఖ మంత్రి ప్రారంభించినప్పటికి నేటి వరకుదానిని ఉపయోగంలోకి అందుబాటులోకి తీసుక రావడంపై దృష్టి సారించని ytda వైస్ చెర్మెన్ దీనికి ఒక ఉదాహరణగా భావించవచ్చు. అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ లో దుకాణాలు కేటాయించడంలో వైటిడి అధికారులకు సరైన స్పష్టత లేదు వైటిడిఏ ఆర్ అండ్ బి దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ నాలుగు శాఖల మధ్య సరైన సమన్వయం స్పష్టత లేకపోవడం వల్ల అనేక రకాలుగా భక్తులకు మరియు ప్రజలకు నష్టం జరుగుతుంది ప్రజలకు అధికారులకు మధ్య అనుసంధానం చేయాల్సిన వైటిడిఏ ప్రధాన కార్యాలయం స్థానికంగా ఉండకపోవడంతోనే స్థానికుల సలహాలు సూచనలు తీసుకోకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని పలువురు అంటున్నారు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకొని నిర్ణయాలు పనులు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వైట్ ఏ వైస్ చైర్మన్ వ్యవహరించడం వల్ల అనేక విధాలుగా ముఖ్యమంత్రి గారి సంకల్పానికి నష్టం జరుగుతుంది.


ఉదాహరణకి క్యూ కాంప్లెక్స్ని కూల్చివేసిన సందర్భాన్ని గమనించవచ్చు ప్రస్తుతం వైటీడీఏ కాంట్రాక్టు అంటే ఎవరు రాని పరిస్థితి నెలకొంది సీఎం కేసీఆర్ చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణం అనే మంచి లక్ష సాధనలో భాగస్వాములు అయ్యేందుకు అనేకమంది స్థానిక యువ కాంట్రాక్టర్లు ఇందులో భాగస్వాములు అయ్యారు ఇందులో పెట్టిన పెట్టుబడి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెడితే మంచి లాభాలు వచ్చేవని వారి అభిప్రాయపడుతున్నారు కానీ సీఎం సంకల్పంలో పాలుపంచుకోవాలని ఉద్దేశంతో ఇందులో కాంట్రాక్టు తీసుకున్న స్థానిక కాంట్రాక్టర్లకు నేటికీ బిల్లులు రాకపోవడంతో వారు అప్పుల పాలయ్యి పరువు పోయి ఆత్మ హత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక కాంట్రాక్టర్లు టెంట్లు వేసుకొని నిరసన దీక్షనులకు దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం వైటీడీఏ కాంట్రాక్టు అంటేనే ఎవరు రాని పరిస్థితి నెలకొంది యాదాద్రి టెంపుల్ డౌలాప్మెంట్ అథారిటీ లో పనిచేయడం అంటేనే అనేక మంది కాంట్రాక్టు బయపడుతున్నారు
వైస్ చెర్మెన్ తనకు హైదరాబాదులో అందుబాటులో ఉండేవారికి బిల్లులు ఇస్తూ స్థానిక కాంట్రాక్టర్లకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారు వారికి ఎలాంటి బిల్లులు ఇవ్వడం లేదు తమకు రావలసిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చాలాకాలంగా రావడంలేదని స్థానిక కాంట్రాక్టర్ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ytda వైస్ చెర్మెన్ పట్టించుకోవడం లేదు దీంతో ఆయన వ్యవహార శైలి వల్ల ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఉంది వైస్ చెర్మెన్,వై టి డి ఏ అధికారులు తీరువల్ల యాదాద్రి నిర్మాణంలో అనేక లోటుపాట్లు అనేక లోపాలు చోటుచేసుకున్నాయి తరచుగా లీకేజీలు వివిధ రకాల పగుళ్లు కుంగిన నిర్మాణా లోపాలు తదితర అంశాలు బయటకు రావడం వల్ల ఇటు ప్రభుత్వానికి అటు యాదాద్రి దేవస్థానానికి నష్టం జరుగుతుంది.
శిల్పారామం లాంటి సెట్టింగులు వేసుకుని అధికారికి యాదాద్రి నిర్మాణం బాధ్యతలు అప్పగించడం వల్ల ఇలాంటి పరిస్థితి జరిగిందని అనేకమంది మేధావులు, విశ్లేషకు,భక్తులు వాపోతున్నారు కేవలం ఆర్కిటెక్టర్లు మాత్రమే నమ్ముకొని పనులు చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి తయారయింది యాదాద్రి ఆలయ నిర్మాణంలో లోపాలను ప్రతిపక్షాలు తమ పబ్లిసిటీకి వాడుకుంటూ ప్రభుత్వాన్ని సీఎంను విమర్శించే పరిస్థితి తలెత్తడానికి కారణం వైటిడిఏ వైస్ చెర్మెన్, వైటిడిఏ అధికారుల తీరు అని విమర్శలు వస్తున్నాయి సీఎం నమ్మకాన్ని వైటీడిఏ వైస్ చెర్మెన్ ,అధికారులు వమ్ము చేశారని పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి నేటికీ యాదాద్రిలో భక్తులకు సరైన మౌలిక వసతులు లేవు మరుగుదొడ్లు తాగునీరు తదితర అనేక రకాల సదుపాయాలు నేటికి ఎక్కడ లేవు అనే ప్రచారం జరుగుతుంది ప్రసాదాల తయారీలో కూడా సరైన నాణ్యత లేదని పలువురు అంటున్నారు.
ప్రధానంగా ప్రసాదాల తయారీకి మిషనరీని తీసుకువచ్చిన ఇప్పటివరకు దానిని వినియోగించకపోవడం వల్ల నిరుపయోగంగా ఉంది దీంతో నేటికీ ప్రసాదాలను సిబ్బందితోనే తయారు చేయిస్తున్నారు యాదాద్రి దేవస్థానంలో దర్శనానికి వచ్చే భక్తులకు ఎండ వానలను సైతం వైస్ చెర్మెన్, అధికారులు అంచనా వేయకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఆలయం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే భక్తులు ఎండవేడికి,వానలకు తాళలేక పరుగులు తీస్తున్న సంఘటనలు అనేకం కనిపిస్తున్నాయి భారీ వర్షాలు సుడిగాలులాంటి వాతావరణ విపత్తుకర పరిస్థితులు వస్తే భక్తులకు ఇక్కడ రక్షణ కరువైంది.
అదేవిధంగా బీపీ షుగర్ తదితరు అనేక వ్యాధులు ఉన్నవారు వృద్ధులు వికలాంగులకు కూడా సరైన ఏర్పాట్లు వైటిడి అధికారులు చేయలేదు వీరికి సరైన వసతులు ఏర్పాటు చేయాల్సిన ప్రణాళిక ముందుగానే వారు రూపొందించుకోవాల్సి ఉంటుంది కానీ అలాంటి ప్లానింగ్ వీళ్ళు రూపొందించుకొక పోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నారు. దాతలు ఇచ్చిన నిధులు కూడా నేటికీ వినియోగించకుండా వాటిని దారి మళ్లించి ఇతర పనులకు ఉపయోగించాలని విమర్శలు వస్తున్నాయి సీఎం కేసీఆర్ సమున్నతమైన సంకల్పాన్ని లక్ష్యాన్ని నీరుగార్చి ప్రస్తుత ఎన్నికల తరుణంలో ఆయనకు ఇబ్బంది కలిగించే విధంగా పరిస్థితులు రావడానికి కారణం వైటిడి వైస్ చెర్మెన్, అధికారులు అని పలువురు ఆరోపిస్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో కూడా వైటిడిఏ అధికారులు సరైన ప్రణాళిక లేకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా రోడ్డును అవసరం లేకున్నా ఎక్కువ ఎత్తుతో బ్రిడ్జి నిర్మించి పట్టణం యొక్క రూపురేఖలను చెడగొట్టారని విమర్శలు వస్తున్నాయి.
ప్రతిపనిని సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించే పరిస్థితి ఉండదు కానీ వైటిడి వైస్ చెర్మెన్, అధికారులు స్థానిక పరిస్థితులను అవగాహన చేసుకుని పట్టణం యొక్క రూపురేఖలు స్థానికుల యొక్క ఉపాధి దెబ్బతినకుండా ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది కానీ అందు విరుద్ధంగా వైకిడి అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు రోడ్డును ఎక్కువ ఎత్తులో నిర్మించి పట్టణాన్ని రెండుగా విడగొట్టి స్థానికుల వ్యాపార ఉపాధిని దెబ్బతీశారని విమర్శలు వస్తున్నాయి స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి కృషి వల్ల అనేక మందికి నష్టపోకుండా మేలు జరిగింది ఆమె కృషి బాగానే ఉన్నా వైటిడిఏ వైస్ చెర్మెన్,అధికారుల తీరు వల్ల స్థానికులు పెద్ద ఎత్తున నష్టపోయారు ప్రధానంగా వైట్ ఏ వైస్ చైర్మన్ వ్యవహార శైలి వల్లే యాదాద్రి దేవస్థానంలో అనేక లోటుపాట్లు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా వైటిడిఏ వైస్ చైర్మన్ తన వ్యవహార శైలిని మార్చుకొని యాదాద్రి దేవస్థానంలో ఉన్న లోటుపట్లను వెంటనే సరిచేసే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రధానంగా స్థానిక కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించి తిరిగి పెండింగ్లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేయించడం లోకపుష్ఠంగా ఉన్న నిర్మాణాలను సరిదిద్ద పనులు చేపట్టాలని అంటున్నారు ప్రధానంగా స్థానిక కాంట్రాక్టర్లు ఉపాధి కోసమే కాంట్రాక్టులు తీసుకొని సీఎం సంకల్పానికి అనుకూలంగా పనులు చేశారు కానీ వారికి బిల్లులు చెల్లించకపోవడం వల్ల అప్పుల పాలై తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
యాదాద్రిలో ఆధ్యాత్మిక వుట్టిపడేలా పర్యాటకం వెలివేరిసేలా ఉండాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు కానీ అందుకు విరుద్ధంగా వైటిడిఏ వైస్ చెర్మెన్, అధికారుల వ్యవహార శైలి ఉంది టెంపుల్ సిటీలో గెస్ట్ హౌస్ లో నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు అక్కడ వేసిన రోడ్లు పార్కులు నిరంతరం ఉపయోగిస్తేనే అవి నాణ్యతగా ఉండి ఉపయోగంలోకి వస్తాయి కానీ వాటిని ఉపయోగించుకోకపోవడం వల్ల అవి పూర్తిగా చెడిపోయి ప్రభుత్వం, యాదాద్రి దేవస్థానం నిధులకు నష్టం వాటిలో పరిస్థితి నెలకొంది అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఏర్పడుతుంది స్థానికంగా ఇల్లు భూములు కోల్పోయిన బాధితులకు సరేనా నష్టపరిహారం పునరావాసం కల్పించడంలోనూ జాప్యం జరుగుతుంది వారికి న్యాయం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తున్న అధికారులు సరియైన వైటీడిఏ వైస్ చెర్మెన్,అధికారులు ఈ విధంగా సహకరించడం లేదని విమర్శలు వస్తున్నాయి అధికారుల సహకారం లోపం వల్ల స్థానిక ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వ్యతిరేకత నెలకొనే అవకాశం కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది తులసి కాటేజ్ లో శిల్పారామం పేరుతో నిర్మాణాలు చేసి బోటింగ్ పేరుతో నిధులు వృధా చేశారని ఆరోపణలు వస్తున్నాయి ఈ నిర్మాణాల వల్ల సుమారు 10 కోట్ల వరకు నిధులు వృధా అయ్యాయని విమర్శలు వెలివేస్తున్నాయి బాలాలయం తొలగించిన ప్రాంతంలో అక్కడ ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం చేయలేదు. బలాలయాన్ని అలాగే ఉంచి అక్కడ నిత్య కళ్యాణాలు ఆర్థిక సేవలు సుదర్శన యాగం లాంటి కార్యక్రమాలు ఉపయోగిస్తే బాగుండేదని పలువురు భక్తజనులు అభిప్రాయపడుతున్నారు. బాలలయం ప్రాంతంలో రంగ మండపం నిర్మాణం చేయాలని ప్రతిపాదనతో వైస్ చెర్మెన్ దానిని కూల్చి ఇప్పటివరకు అక్కడ ఎలాంటి నిర్మాణం చేయలేదు. బాలల ఎం ప్రాంతంలో రంగనాయక మండపం ప్రతిపాదన కూడా వైటిడిఏ వైస్ చైర్మన్ ని ముఖ్యమంత్రి పర్యవేక్షణలో దానిని కేసిఆర్ అంగీకరించలేదు ఇక్కడ సరైన ముందు చూపు లేకుండా నిర్ణయం తీసుకోవడం వలన ప్రభుత్వం మరియు దేవస్థానం వారికి నష్టం జరుగుతుందని పలువురు అంటున్నారు. బలాలయం తొలగించిన కాంట్రాక్టర్కు నేటి వరకు బిల్లులు కూడా ఇవ్వకపోవడంతో ఆ కాంట్రాక్టర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నిత్య కళ్యాణం యాదాద్రి ఆలయంలోని నిర్వహించడం వల్ల బాగా రద్దీ ఉన్న సమయంలో అనేక రకాల ఇబ్బందులు తయారవుతున్నాయి నిత్య కళ్యాణం ప్రాంతంలో కిక్కిరిసిపోయిన భక్తులతో అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి బాలాలయాన్ని అలాగే ఉంచి అక్కడ నిత్య కళ్యాణాలు జరిపిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని ఈ సమస్య వచ్చేది కాదని భక్తులు అంటున్నారు నిత్య కళ్యాణాలతోపాటు విశేష ఉత్సవాలు ఆర్జిత సేవలు సుదర్శన యాగం లాంటి అనేక ప్రత్యేక పూజా కార్యక్రమాలను బాలాలయంలోనే నిర్వహిస్తే బాగుండేదని భక్తులకు ఇబ్బందులు తప్పేవని అర్చక అర్చకులకు కూడా సౌకర్యంగా ఉండేదని భక్తులు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఎక్కడ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అనే విధంగా తమకున్న కష్టాలు సమస్యలను ఇక్కడ దేవుడికి చెప్పుకుందాం అని వచ్చే భక్తులకు ఇక్కడ కూడా సమస్యలు ఇబ్బందులు ఎదురవడంతో ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి భక్తులకు ఎదురవుతుంది ఈ పరిస్థితికి కారణం వైటిడిఏ వైస్ చెర్మెన్, అధికారులేనని విమర్శలు వస్తున్నాయి. వై టి డిఏ వైస్ చెర్మెన్,అధికారులు కేవలం ఏసీ గదులకే పరిమితం కాకుండా యాదాద్రి ఆలయం పుణ్య నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ మీద ఉండి పరిశీలిస్తూ స్థానికుల పరిస్థితి భక్తుల కావాల్సిన సౌకర్యాల గురించి ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకొని నిర్మాణాలు చేయిస్తే ఈ సమస్యలు ఈ దుస్థితి తల్లేతెవి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు వారు కేవలం కార్యాలయాలకు పరిమితమై పేపర్ మీదనే వర్క్ చేయడం వల్ల స్థానికంగా వాస్తవ పరిస్థితులపై అవగాహన రాక ఇలాంటి సమస్యలు తలెత్తాయని పలువురు అంటున్నారు. ఎప్పటికప్పుడు భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటూ బాగా రద్దీ ఉన్న సమయంలో వారికి ఎలాంటి సౌకర్యాలు అవసరం ఎలాంటి మౌలిక వసతులు అవసరం వారికి తలెత్తుతున్న ఇబ్బందులు ఏమున్నాయి అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటే వారికి సరియైన సౌకర్యాలు ఏర్పాటు చేయించాలని అభిప్రాయపడుతున్నారు. అలా తెలుసుకోకపోవడం వల్లే భక్తులకు సమస్యలు ఎక్కువ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని పలువురు విమర్శిస్తున్నారు .అంతే కాకుండా ఈ దేవస్థానికి వివిధ రాష్ట్రాలనుండి భక్తులు పెద్ద ఎత్తున సందర్శనకు వస్తున్నారు కానీ ఆలయ పునః నిర్మాణం జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా సరైన గదులు ఇతర వసతులు లేకపోవడం వల్ల వేసిన భక్తులు వచ్చినట్లే తిరిగి వెళ్తున్నారు వి ఐ పి లకు అతిధి గృహాలు నిర్మించి సామాన్య భక్తులకు విస్మరించారు అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇసుక వేస్తే రాలనంత జనం వేలాదిగా జనం తండోపతండాలుగా వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయడంలో అక్కడి అధికారులు విజయవంతం అవుతున్నారు అలాంటివారిని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా పనులు చేస్తే భక్తులకు స్థానికులకు ఇబ్బందులు తలెత్తి ఉండేవి కావని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కావున వైటిడిఏ వైస్ చైర్మన్ తక్షణమే విషయమే స్పందించి కాంట్రాక్టర్లకు న్యాయం చేయడంతో పాటు స్థానికంగా భూములు ఇండ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించడంలో తిరిగి స్థానికంగా ఉపాధి కోల్పోయిన వారికి తగిన విధంగా న్యాయం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తక్షణమే జరిగిన నష్టాన్ని నివారించే విధంగా వైటిడిఏ వైస్ చైర్మన్ ముందుకు రాకపోతే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని దేవస్థానంమరియు ప్రభ్త్వానికి వైటిడివైస్ చెర్మెన్, అధికారుల తీరు వల్ల మరింత విమర్శల పాలయ్యే అవకాశం ఉందని మేధావులు ,భక్తులు అంటున్నారు ముఖ్యమంత్రి సంకల్పాన్ని పరిరక్షించే భాద్యత వైస్ చెర్మెన్ పైనే ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking