వరుస ఘటనలతో తల్లడిల్లుతున్న గౌడ కుటుంబాలు
– తాడి చెట్టు పైనుండి నేలరాలిన మూల ఆదినారాయణ
– అక్కడికక్కడే మృతి
– గౌడులు ఇలా చలల్సిందేనా….?
– గాలికొదిలేసిన సేఫ్టీ మోకుల కథ…!
– ద్రిగ్బాంది వ్యక్తం చేసిన జిల్లా అధ్యక్షులు పరిటాల రవి కుమార్ గౌడ్
– గౌడుల చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
– మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి
– నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శ
– సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పరిటాల డిమాండ్
నకిరేకల్ అక్షిత ప్రతినిధి:
జిల్లాలో వరుస ఘటనలతో తల్లడిల్లుతుంది. ఓ గీతా కార్మికుడు నేలరాలి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే ఆత్మకూర్ (ఎం) మండలం, టి. రేపాక గ్రామానికి చెందిన మూల ఆదినారాయణ అనే గీతా కార్మికుడు కుల వృత్తి లో భాగంగా రోజు వారిగానే ఉదయం వెళ్ళారు. ప్రమాద వశాత్తూ తాడి చెట్టు మీద నుండి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం భువనగిరి జిల్లా అధ్యక్షులు పరిటాల రవి కుమార్ గౌడ్ తీవ్ర ద్రిగ్బాంది వ్యక్తం చేశారు. అనంతరం గ్రామానికి చేరుకుని ఆదినారాయణ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గౌడుల చావులకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎప్పటికీ గౌడులు ఇలా చావల్సిందెనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం కుల వృత్తిదారులకి సేఫ్టీ మోకులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు కట్టు కథ అల్లినట్టు, ఇప్పటి వరకు ఉసు లేకుండా చేసింది. ఆదినారాయణ కుటుంబాన్నీ ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గౌడ కులస్తులు ఇలా తాడి చెట్టు మీద నుండి కింద పడిన గీతా కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. అధికారులు ఆలస్య చేయకుండా ప్రభుత్వం నుండి రావాల్సిన ఎక్స్ గ్రేషియా వెంటనే విడుదల చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు.
జిల్లాలో ఏ గౌడ సొదరుడకి, కుటుంబాలకి సమస్య వచ్చినా, తన దృష్టికి తీసుకవేస్తే పరిష్కార దిశగా అడుగులు వేస్తామని తెలియజేశారు.