బిఆర్ఎస్ తోనే పల్లెల సమగ్రాభివృది
ఎంఎల్ఏ భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
బిఆర్ఎస్ తోనే గ్రామాల్లో సమగ్రాభివృది జరుగుతుందని, అభివృద్ధి జరగాలంటే ఆదరించాలని మిర్యాలగూడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ప్రజలను కోరారు. శుక్రవారం మిర్యాలగూడ మండలంలోని వాటర్ ట్యాంక్ తండ, భాగ్య తండ, చిల్లాపురం, కుంటకింది తండ, ఐలాపురం, కుర్యాతండ, టిక్యా తండ, జంకు తండ, వెంకటాద్రిపాలెం, శ్రీనివాసనగర్, దుబ్బతండ తదితర గ్రామాల్లో ప్రగతియాత్ర జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ రావు
మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. తెల్ల రేషన్ కార్డుదారులందరికీ అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని, ఆసరా పెన్షన్, రైతు బంధు లబ్ధి దశలవారీగా పెంపుదల చేస్తామన్నారు. ప్రతీ ఇంటికి కెసిఆర్ బీమా అందిస్తామని వివరించారు. శ్రీనివాసనగర్ గ్రామ పంచాయితీ రాష్ట్రస్థాయిలోనే గాక దేశంలోనే ప్రత్యేక గుర్తింపు అభివృద్ధిలో సాధించిందని, దీనికి మనమందరం గర్వపడుతున్నామని చెప్పారు. అధికారంలోకి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను మూడోసారి గెలిపించాలన్నారు. ప్రజలందరూ మరోసారి ఆశీర్వదించాలని భాస్కర్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ చిట్టిబాబు నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.