కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ఎంతో అభివృద్ధి…

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ఎంతో అభివృద్ధి…
హోం మంత్రికే అపార్ట్మెంట్ ఇవ్వని కెసిఆర్ ప్రజలకు ఏం మేలు చేస్తారు. బండి రమేష్.

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని బిఆర్ఎస్ ప్రభుత్వ బూటకపు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం కూకట్పల్లి మోగల్స్ ప్రార్యడేజ్ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శ్యామ మొహమ్మద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్, కూకట్పల్లి ఎన్నికల కోఆర్డినేటర్ సత్యం శ్రీరంగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పరిశ్రమలు, జాతీయ రహదారులు, ప్రాజెక్టులు, మెట్రో రైల్వే నిర్మాణాలు, ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహారావు హైవే 11.2 కిలోమీటర్లు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏకకాలంలోనే కమిట్మెంట్తో పని చేసిన వ్యక్తి అని బండి రమేష్ గుర్తుచేశారు. వివిధ నిర్మాణాలు కాంగ్రెస్ పార్టీ హాయంలోనే జరిగాయని అన్నారు. ఈ నిర్మాణాలు కేసీఆర్ కు కనిపించట్లేదా అని ధ్వజమెత్తారు.  కాలేశ్వరం ప్రాజెక్టు  ఏమేరా నాణ్యత ప్రమాణాలతో నిర్మించారని, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మూడు సంవత్సరాల లోనే బ్రిడ్జి పిల్లర్లు కుంగిపోయాయని, ప్రాజెక్టులో వాటర్ బుంగలు పడి వాటర్ అంత ఎల్లిపోతుందని గత సంవత్సరం వర్షాలు పడితే బాహుబలి మోటర్లు నీటిలో మునిగిపోయాయని ఇవి కేసిఆర్ అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. అలాగే రైతులకు 600 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి రైతుబంధు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. దళితులకు దళిత బంధు 10 లక్షలు ఇస్తామని అందరికీ ఇవ్వకపోవడం దురదృష్టకరమం.ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇవన్నీ చేయకపోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ నేరుగా సీఎం ను కలవలేని స్థితిని ఉందని గుర్తు చేశారు. సామాన్యులకు ఇలాంటి ముఖ్యమంత్రి ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారని దుమ్మెత్తి పోశారు. ఐటి శాఖ మరియు మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నగరంలో ఎన్ని ఐటి పరిశ్రమలను తీసుకువచ్చారు. శ్వేత పత్రం విడుదల చేయాలని హైదరాబాద్ నగరం లో హైటెక్ సిటీ ప్రాంతం గతంలోనే ఐటి పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. తమరు కొత్తగా తెచ్చిన పరిశ్రమలు ఏమీ లేవని విమర్శించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో తనను గెలిపిస్తే ప్రజాసేవ చేస్తానని తెలిపారు. యువతకు పెద్దపీట వేస్తామని కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న  ఆరు పథకాల సూత్రాన్ని నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందే విధంగా చేస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విలేకరులకు సరియైన న్యాయం చేస్తామని తెలియజేశారు. కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలు తమకు చెయ్యి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking