పటిష్ఠవంతంగా ఎన్నికల జరిపించాలి -కలెక్టర్ ఆర్ వి కర్ణన్

పటిష్ఠవంతంగా ఎన్నికల జరిపించాలి
కలెక్టర్ ఆర్ వి కర్ణన్

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

శాసన సభ సాధారణ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌, కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన
ఎన్నికల వ్యయ పరిశీలకులు,
ఎన్నికల వ్యయ కమిటీలు, లీడ్ బ్యాంక్ మేనేజర్,ఎక్సైజ్,ఇతర శాఖలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత ఎన్నికల కమిషన్ నియమించిన 93-నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం, 95-నకిరేకల్ నియోజకవర్గాలకు సంతోష్ కుమార్‌ (ఐఆర్‌ఎస్‌),
86-దేవరకొండ, 93-మునుగోడు నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులు సతీష్ గురుమూర్తి,
87-నాగార్జునసాగర్, 88-మిర్యాలగూడ నియోజకవర్గాలకు డి.ఎం. నిమ్జే లు హాజరయ్యారు.
ఎన్నికల జిల్లాలో ఎన్నికల ఖర్చుల నమోదు కోసం ఏర్పాటుచేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, స్టాటిక్‌ సర్వేలె న్సు బృందాలు, వీడియోసర్వేలెన్సు బృందాలు, వీడియో వ్యూయింగ్‌ బృందాలు, వాటి పనితీరు తదితర అంశాలను కలెక్టర్‌ ఎన్నికలపరిశీలకులకు వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై, 1950 టోల్‌ఫ్రీ నంబర్‌, సీవి జిల్‌ యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదులను కంట్రోల్‌రూమ్‌ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ పరిష్కరిస్తున్నామని కలెక్టర్‌ ఎన్నికల వ్యయ పరిశీలకులకు వివరించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలపై కూడా పకడ్బందీగా టీం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సెక్టర్ ఆఫీసర్లు, తహసిల్దార్లు, పోలీసులు ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘనలపై నిఘా ఉంచి తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా తర్వాత నల్లగొండ జిల్లాలోనే అత్యధికంగా డబ్బులు, మద్యం ఇతర వస్తువులు పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా పోలీస్, ప్లయింగ్ స్క్వాడ్ ద్వారా స్వాదీనం చేసుకున్న 33 కోట్ల 63 లక్షల 7 వేల 930 రూ.లు విలువగల
నగదు,,ఇతర వస్తువులు
210 కేసులకు సంబంధించి
అప్పీ ళ్లను పరిశీలించి 203 కేసులు పరిష్కరించి
33 కోట్ల 39 లక్షల 29 వేల 930 రూ లు నగదు,వస్తువులు రిలీజ్ చేసినట్లు తెలిపారు .ఇంకా 7 కేసులు పది లక్షలకు పైబడి నగదు ఉన్నందున ఐటీ శాఖకు రెఫర్ చేయడం జరిగింది అని ఆయన తెలిపారు. పోలీస్ శాఖ ద్వారా 10 కోట్ల 87 లక్షల 58 వేల 490 రూపాయల నగదు,27 కోట్ల ఒక లక్ష 35 వేల 625 బంగారము, వెండి, డైమండ్స్ తదితర వస్తువులు, 62 లక్షల 61 వేల 800 రూపాయలు, గంజాయి బెల్లం, 22 లక్షల 85 వేల 769 రూపాయలు మద్యం, ఇతర వస్తు రూపేనా 26 లక్షల 48 వేల 180 రూపాయలు, మొత్తం 39 కోట్ల 89 వేల 864 రూపాయలు ఇప్పటివరకు పట్టుబడినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ఎక్సైజ్ శాఖ ద్వారా ఒక లక్ష 23 వేల లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. వీటి విలువ వాహనాలు తో కలిపి మొత్తం రెండు కోట్ల 70 లక్షల విలువ ఉంటుందన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా మొత్తం 824 కేసులు నమోదు చేసి 268 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు అదేవిధంగా 10 వాహనాలను సీజ్ చేశామన్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 249 కేసులు రాగా అందులో ఎన్నికలకు సంబంధించిన వాల్ పోస్టర్లు గోడ రాతలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన తదితర అంశాలకు సంబంధించిన 195 కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఎన్నికలకు సంబంధంలేని 54 కేసులను తిరస్కరణకు గురైనట్లు ఆయన తెలిపారు. సి విజిల్ పై గ్రామ గ్రామాన విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ బూత్ స్థాయిలో అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అపూర్వరావు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, అధికారులు సంతోష్ కుమార్, సతీష్ గురుమూర్తి, డి.ఎo. నిమ్జే, నోడల్ ఆఫీసర్లు, ఎక్స్పెండిచర్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking