అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని పోరాడి తెలంగాణ సాధించుకున్నాం

అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని పోరాడి తెలంగాణ సాధించుకున్నాం

విద్య, వైద్యం, తాగునీళ్లు, సాగునీళ్లు, విద్యుత్ రంగాలను గణనీయంగా అభివృద్ది

కాంగ్రెస్ పాలనలో అనుభవించిన బాధలు, కష్టాలు ప్రజలకు తెలుసు

అప్పుడే వాటిని మరిచిపోయి ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తారనుకోవడం అత్యాశ

గత తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజలతో ఉన్నాం

మీ బిడ్డగా, మీ సోదరుడిగా, మీ ఇంట్లో సభ్యుడిగా మీ అండగా ఉంటాన్నా ఎమ్మెల్యే బొల్లం మల్లన్న

కోదాడ శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్
మాజీ ఇంచార్జి శశిధర్ రెడ్డి

కోదాడ అక్షిత ప్రతినిధి

వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేయబోతున్నదన్న బీఆర్ఎస్ మేనిఫెస్టో అని కోదాడ శాసనసభ్యులు,బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఇంచార్జి శశిధర్ రెడ్డి అన్నారు.శనివారం బీక్య తండా,రామలక్ష్మిపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనిమాట్లాడుతూ..నియోజకవర్గంలో గత 9 ఏండ్లలో జరిగిన అభివృద్ధి, ఇంటింటికీ పకడ్బందీగా అమలవుతున్న సంక్షేమ పథకాలే కారు గుర్తు కు ఓటు బ్యాంక్ అని ఆయన అన్నారు.కోదాడ ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ వల్లే జరిగింది. ఇకపై కూడా అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అని ఆయన తెలిపారు.కంటి ముందు అభ్యర్థి ఇంటి ముందు అభివృద్ధి.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేను. ఎప్పుడూ ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసమే పాటు పడుతున్నాను అని ఆయన తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో, మ్యానిఫెస్టో విడుదలలో, ప్రచారంలో ఎట్లైతే ముందు ఉందో రేపు జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధించడంలో బిఆర్ఎస్ పార్టీ ముందుంటుంది అని అన్నారు.బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయింది అని తెలిపారు.కెసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు, రైతుబంధు, ఉచిత కరెంటు, ఆసరా పెన్షన్ వంటి సంక్షేమ పథకాల పేర్లు మార్చి కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తుంది అని తెలిపారు.అదే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకి, హామీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్యారెంటీ అని ఆయన అన్నారు.
వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేయబోతున్నదన్న బీఆర్ఎస్ మేనిఫెస్టో అని ఆయన తెలిపారు.తెలంగాణలో 93 లక్షల పైగా కుటుంబాలకు కేసీఆర్ బీమా..
ప్రతి ఇంటికి ధీమా పథకం 5 లక్షల బీమా ఇవ్వడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.తెలంగాణ అన్నపూర్ణ పథకం’ పేరుతో… తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అని ఆయన అన్నారు.ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు అధికారంలోకి మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016 చేయడం జరుగుతుంది అని తెలిపారు.వికలాంగుల పెన్షన్ రూ.4016 నుండి రూ.6016 పెంపు,రైతు బంధు పథకం ఎకరానికి రూ.10,000 నుండి రూ.16,000 వేలకు పెంపు,మొదటి సంవత్సరం ఎకరానికి రూ.12,000 చొప్పున ఇచ్చి పెంచుతూ రూ.16,000 ఇవ్వడం జరుగుతుంది.సౌభాగ్య లక్ష్మీ పథకం అర్హులైన ప్రతి మహిళకు రూ.3,016లు భృతి,
ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.అర్హులైన వారికి రూ.400లకే గ్యాసి సిలిండర్,అక్రిడేషన్ కార్డున్న ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అని ఆయన అన్నారు.ఆరోగ్య లక్ష్మీ పెంపు ఆరోగ్య లక్ష్మీ రూ.15లక్షలకు పెంచడం జరుగుతుంది అని ఆయన అన్నారు.బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం,దళిత బంధు కొనసాగింపు జరుగుతుంది అని ఆయన అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారంటీలు పూటకొకటి ఎగిరిపోతున్నాయి అని తెలిపారు.ఆరునెలలకే కర్ణాటక అతలాకుతలం అవుతున్నది అని ఆయన అన్నారు.అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని పోరాడి తెలంగాణ సాధించుకున్నాం అని అన్నారు.తెచ్చుకున్న తెలంగాణలో కృష్ణ, గోదావరి జలాలను తెలంగాణ బీళ్లకు మళ్లించుకున్నాం అని తెలిపారు.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత వేగంగా అభివృద్ది చెందిన రాష్ట్రం లేదు అని అన్నారు.ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ది వదిలేసి కాంగ్రెస్ మాటలు ప్రజలు నమ్మరు అని తెలిపారు కాంగ్రెస్ చేసిన.గాయాలను ప్రజలు అప్పుడే మరిచిపోరు అని అన్నారు.కాంగ్రెస్ పాలనలో అనుభవించిన బాధలు, కష్టాలు ప్రజలకు తెలుసు అని తెలిపారు.అప్పుడే వాటిని మరిచిపోయి ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తారనుకోవడం అత్యాశ అని అన్నారు.గత తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజలతో ఉన్నాం అని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, సొసైటీ చైర్మన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking