గ్రామీణ వైద్యులకు గుర్తింపు నివ్వాలి 

గ్రామీణ వైద్యులకు గుర్తింపు నివ్వాలి 
అధ్యక్షులు హనుమంతరావు

అక్షిత న్యూస్, మాడుగులపల్లి:
మండల కేంద్రంలో గౌరవ అధ్యక్షుడు హనుమంతరావు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉంటూ పేదలకు వైద్య సేవలు సహాయం అందిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలన్నారు. పారామెడికల్ కోర్స్ కు సంబంధించిన శిక్షణ ఇప్పించి సర్టిఫికెట్స్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డివిఏన్ చారి, మండల ప్రధాన కార్యదర్శి పగిడిమర్రి నాగేందర్, అనంతరపు శ్రీనివాస్,డాక్టర్ హుస్సేన్, కుదువుద్దీన్ ,శ్రీను,సందీప్,సంధ్య, కవిత, సలీo తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking