ఖమ్మంలో వెంకటరమణ మోటార్స్ వారి ఉమెన్స్ ఎక్సక్లూసివ్ కార్ షోరూం
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
టాటామోటార్స్ వారు తమ పాసింజర్ వెహికల్ విభాగంలో తమ అధీకృత డీలర్ ఐన వెంకటరమణ మోటార్స్ ద్వారా ప్రెస్టేజియస్ మహిళా కార్ షోరూం ని ఖమ్మం లో ప్రారంభించారు.ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా డాక్టర్ బోడేపూడి శైలజ పాల్గోని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారని ఆటోమొబైల్ రంగంలో కూడా ఇంకా ముందుకు రావాలని అన్నారు. వెంకటరమణ మోటార్స్ వారు మన ఖమ్మం లో ఎక్సక్లూసివ్ గా ప్రత్యేకంగా మహిళ లతో ఈ టాటా కార్స్ షోరూం ని ప్రారంభించడం అభినందనీయని అన్నారు.ప్రతి మహిళా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తన ఫామిలీ ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటారని అలాగే ప్రతి కస్టమర్ ని ఆత్మీయంగా ఆదరిస్తారని కోరుకుంటానని అన్నారు.ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇంటికి దీపం ఇల్లాలు ఎలాగో ఉద్యోగంలో కూడా అలాగే ఉండాలని ఆలోచనతో మా వెంకటరమణ మోటార్స్ ఇండియా లో మొట్టమొదటి ప్రెస్టేజియస్ మహిళా కార్ షోరూం ని హైదరాబాద్ లో ప్రారంభించాము అని ఇప్పుడు మన ఖమ్మంలో రెండవ మహిళా ఎక్సక్లూసివ్ కార్ షోరూం ని మా వెంకటరమణ మోటార్స్ లాంచ్ చేస్తున్నదని చెప్పారు.ఈ షోరూం ఓన్లీ మహిళా ఉద్యోగులతో నడపబడుతుంది అని సెక్యూరిటీ నుండి డ్రైవర్ వరకు అందరూ మహిళా మనులే ఉంటారని టెస్టు డ్రైవ్స్ కూడా నిపుణులైన మహిళా డ్రైవర్స్ తో నడపబడుతుందని చెప్పారు.టాటా ప్యాసింజర్ కార్ విభాగంలో 5 స్టార్ రేటింగ్స్ తో ఆటోమొబైల్ రంగంలో ముందు ఉన్నదని ఎలక్ట్రికల్ కార్ విభాగంలో సేఫ్టీ పరంగా మరియు మైలేజ్ పరంగా అద్భుతము గా ఉన్నాయని టాటా టియాగో ఈవి టాటా తిగోర్ ఈవి నెక్సాన్ ఈవి లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 7 సీటర్ లో సఫారీ మరియు హరియర్ సరికొత్త మోడల్స్ లలో మైలేజ్ ఎక్కువ మెయింటెనెన్స్ తక్కువ తో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ టాటా కార్స్ మధ్యతరగతి కస్టమర్ నుండి విఐపి కస్టమర్స్ కి అందుబాటులో ఉన్నాయని మా వెంకటరమణ మోటార్స్ కస్టమర్ సర్వీస్ కొరకు ఖమ్మం కొత్తగూడెం సత్తుపల్లి కోదాడ సూర్యాపేట లలో క్వాలిఫైడ్ టేక్నిషయన్లతో నడపబడుతున్నదని ప్రతి సర్వీస్ పాయింట్ నందు కస్టమర్ క్విక్ సర్వీస్ ఉన్నాదని మరియు కస్టమర్ సాటిఫికేషన్ కోరకు కంప్లైన్ట్ ఫీడ్ బ్యాక్ రిజిస్టర్ అందుబాటులో ఉంటుంది అని అన్నారు.ఈ సందర్భంగా మా ఈ ఎక్సక్లూసివ్ మహిళా షోరూం లో మహిళలకు ప్రత్యేక డిస్కౌంట్ మరియు స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తున్నాము అని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు.ఈ కార్యక్రమములో సంస్థ చైర్మన్ శ్రీమతి ద్రౌపతి మాట్లాడుతూ మహిళలు వాహనాలు ఎక్కువగా వాడుతున్నారని వారి కొరకు ఈ మహిళా షోరూం మా సంస్థ వెంకటరమణ మోటార్స్ ఎక్సక్లూజ్వ్ మహిళా షోరూం మన ఖమ్మం లో రావడం చాల ఆనందంగా ఉన్నాడని చెప్పారు.ముఖ్యంగా వాహనం నడిపేవారు మరియు లోపల ఉన్నవారు కూడా సీట్ బెల్ట్ తప్పక పెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమము లో సంస్థ మహిళా ఉద్యోగినులు మరియు కస్టమర్స్ పాల్గొన్నారు.