లద్దెకు గులాబీ కండువా కప్పిన కేటీఆర్

గులాబీ గూటికి లద్దె నాగరాజు” 

కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన లద్దే నాగరాజు

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి: గులాబీ గూటికి లద్దె నాగరాజు” చేరువయ్యారు.లద్దె నాగరాజుకు టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పది సంవత్సరాలలో ఎంతో కష్టపడి శేరిలింగంపల్లి నియోజకవర్గంను అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని బిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు లద్దే నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. శనివారం మియాపూర్ నరేన్ గార్డెన్ లో ప్రభుత్వ విప్ గాంధీ,బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ లద్దే నాగరాజ్ కు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గతంలో పరిపాలించిన పార్టీలు తమ కుటుంబాల కోసమే పరిపాలించారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్ని వర్గాలకు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఏ పార్టీ చేయని విధంగా తెలంగాణను అభివృద్ధిని బిఆర్ఎస్ పార్టీ ఈ పది సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసిందని అన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అర్కేపుడి గాంధీని మరోసారి ఆశీర్వదించాలని లద్దే నాగరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking