ఎమ్మెల్యే చిరుమర్తి కి రాజకీయ పుట్టగతులు ఉండవు మున్సిపల్ చైర్మన్
అక్షిత చిట్యాల:
తన రాజకీయ అభివృద్ధికి కృషిచేసిన రాజకీయ గురువు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా విమర్శించడం తన రాజకీయ భవిష్యత్తుకు పుట్టగతులు ఉండవని మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం చిట్యాల పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం ల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటినుంచి రాజకీయ ఓనమాలు నేర్పించి తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా విమర్శించడం ఎంతో బాధ కలిగించిందని అందుకు గాను బిఆర్ఎస్ పార్టీలో ఉండలేక మాతృ పార్టీ అయినా కాంగ్రెస్ లోకి రావడం జరిగిందన్నారు. తాను 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశానని అనంతరం ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆయన వెన్నంటే ఉంటూ ఆయనకు సహకరించడం జరిగిందన్నారు. అందుకుగాను ఆయన మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించo జరిగిందని అన్నారు. తన జీవితానికి, రాజకీయ ఎదుగుదలకు కారణమైన మహోన్నత వ్యక్తిని విమర్శించడం తీవ్రంగా బాధించడంతోనే తాను పార్టీ మారానని ఇకనుంచి తన జీవిత కాలమంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని అన్నారు. అలాగే త్వరలో జరగనున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం గెలుపు కోసం మండల వ్యాప్తంగా ప్రచారం నిర్వహించి మండలంలో అత్యధిక మెజార్టీ సాధించి పెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసయ్య, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, కందిమల్ల సుష్పాల్ రెడ్డి సాగర్ల గోవర్ధన్, 2వ వార్డ్ కౌన్సిలర్ కోనేటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు