ఈ నెల 11న జరిగే మాదిగల విశ్వరూప మహాసభకు జాతీ యావత్తు తరలి రావాలి
*వర్గీకరణ సాధించినప్పుడే మాదిగల గెలుపు… భవిష్యత్తు
*ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
హైదరాబాద్ లో ఈనెల 11న జరిగే మాదిగల విశ్వరూప మహాసభకు మాదిగ జాతి యావత్తు తరలిరావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం లోని గాంధీ నగర్ లో ఆదివారం రాత్రి జరిగిన మిర్యాలగూడ నియోజకవర్గ సన్నాహక సభలో మంద కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయని, బీఆర్ఎస్ కాంగ్రెస్, బిజెపిలు ఓట్ల కోసం తిరుగుతున్నారని, మేము మాదిగ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం తిరుగుతున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించేంతవరకు ఏ పార్టీ గెలిచిన, ఓడిన మాదిగలకు ఒరిగేది ఏమీ లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధించినప్పుడే మాదిగల గెలుపని, మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు. మాదిగల విశ్వరూప మహాసభకు లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తొలుత మందకృష్ణ మాదిగకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. సభలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జ్ కందుకూరి సోమయ్య, దైద సత్యం మాదిగ రాజశేఖర్, రామకృష్ణ, ఆకారం సైదులు, విజయ్, పోలగాని వెంకటేష్ గౌడ్, సండ్ర నాగరాజు మాదిగ, తల కొప్పుల సైదులు, దైద శ్రీను మోహన్ శ్రావణ్ కుమార్ తైద కిరణ్, దైద గోపి, శంకర్, నరేష్, మాదిగ జర్నలిస్ట్ ఫోరం మిర్యాలగూడ అధ్యక్షులు బొంగరాల మట్టయ్య, అహ్మద్ ఖాన్, బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, మొండికత్తి లింగయ్య పాల్గొన్నారు.