తమ్మర కాపుగల్లు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
ఎంపీ ఉత్తం మాజీ ఎమ్మెల్యే వేమేపల్లి ,ఉత్తం పద్మావతి, సమక్షంలో నాలుగో వార్డ్ కౌన్సిలర్ సామినేని ప్రమీల రమేష్ మూడో వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్ కాపుగల్లు గ్రామానికి చెందిన జగన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరిక
కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తా
కోదాడ అక్షిత ప్రతినిధి:
కోదాడలోని మూడు నాలుగో వార్డుకు చెందిన సామినేని ప్రమీల రమేష్ ,సామినేని నరేష్ ,కాపుగల్లు గ్రామానికి చెందిన జగన్ ఆధ్వర్యంలో సుమారు 1500 మంది ఎంపీ ఉత్తం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు ఉత్తం పద్మావతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం లో ప్రజలను అబద్ధపు హామీలతో మోసం చేస్తూ కుటుంబ పాలన నిర్వహిస్తున్నారని టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి పాలన కొనసాగుతున్నదని త్వరలోనే టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే కోదాడ హుజూర్నగర్ అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫోర్ వే లైను సిక్స్ వే లైన్ గా మారుస్తానని విజయవాడ టు హైదరాబాద్ కు రైల్వే మార్గం ఏర్పాటు కు తప్పకుండా కృషి చేస్తానని కోదాడ ప్రభుత్వ 30 పడకల హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని సముచిత స్థానం కల్పించి కాపాడుకుంటానని వారు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ముత్తవరపు పాండురంగారావు వంగవీటి రామారావు ఎర్నేని వెంకటరత్నం బాబు అల్తాఫ్ హుస్సేన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు