హస్తం… పేదల నేస్తం

హస్తం… పేదల నేస్తం

జవహర్ నగర్, అక్షిత ప్రతినిధి :

జవహర్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రెష్ యాదవ్ కాలనీలను సందర్శించి కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన 6 సంక్షేమ పథకాలను పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఇంత పెద్ద జవహర్ నగర్ లో బడుగు బలహీన వర్గానికి చెందిన ప్రజలు నివసించే వారు ఎక్కువ ఉన్నారని డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు పడుతున్న బాధలు అంతా ఇంతా కాదని దాని నుండి వచ్చే వాసనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి గారికి తెలియదా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఒక్కరి కూడా రాలేదని పిల్లలు చదువుకోవడానికి సరైన స్కూలు లేవని ఒక్క ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజీ కానీ ఒక ప్లేగ్రౌండ్ గానీ లేదని కనీసం 50 పడకల ఆసుపత్రి కూడా లేదని జవహర్ నగర్ లో ఎంతోమంది దళితులు ఉన్న దళిత బంధు ఒక్కరికి కూడా రాలేదని మరి ప్రజలకు ఏం చేశావని ప్రశ్నించారు.

తల్లి సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దీవెనలతో మేడ్చల్ గడ్డమీద బీసీ బిడ్డగా మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చానని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ హస్తం ఎల్లప్పుడూ పేదల నేస్తంగా ఉంటుందని మీయొక్క సమస్యలన్నీ తీరుస్తానని మేడ్చల్ నియోజకవర్గం అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు జవహర్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ మరియు సీనియర్ నాయకులు కల్లపల్లి సదానందం మట్ల శ్రీనివాస్ యూత్ అధ్యక్షులు మట్ల వినాయ కారింగుల శంకర్ గౌడ్ కారింగుల నిహారిక గౌడ్, నాయకులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking