సరిహద్దుల్లో పక్కా నిఘా
*అంతర్ రాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారుల పరస్పర సమన్వయ సమావేశం
రెండు జిల్లాల పోలీస్,ఎక్సైజ్,రవాణా,వాణిజ్య పన్నుల శాఖ,అటవీ శాఖ అధికారుల సమావేశం*
# వాడపల్లి చెక్ పోస్ట్ తనిఖీ చేసిన కలెక్టర్,ఎస్.పి.లు
ఇరు రాష్ట్రాల నుండి అక్రమ మధ్యం,నగదు సరఫరా కాకుండా పటిష్ఠ నిఘా..
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రం శాసనసభ ఎన్నికల సందర్భంగా వాడపల్లి వద్ద ఏర్పాటు చేసిన సమీకృత చెక్ పోస్ట్ ను జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్,ఎస్.పి.అపూర్వ రావు, తనిఖీ చేశారు. వీరితో పాటు ఆంధ్ర రాష్ట్ర పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివ శంకర్,ఎస్.పి.రవి శంకర్ రెడ్డి, అధికారులు ఉన్నారు .
ఇరు రాష్ట్రాల నుండి అక్రమ మధ్యం,నగదు సరఫరా కాకుండా పటిష్ఠ నిఘా పెడుతూ తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లు,ఎస్.పి.లు ఆయా శాఖల అధికారులు,
సిబ్బందికి సూచించారు.
అనంతర అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు సంబంధిత ఇతర అధికారులతో వాడపల్లి పెన్న సిమెంట్ ఫ్యాక్టరీ కాన్ఫిరెన్స్ హల్ నందు పరస్పర సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగినది.
ఈ సమావేశం నందు తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల సందర్భంగా అంతరాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో 24/7 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం, నగదు సరఫరా నియంత్రణ కొరకు చేపట్టాల్సిన చర్యల గురించి, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఇరు రాష్ట్రాల ఇంటలిజెన్స్ పరస్పర సమాచారం పంచుకోవడం ద్వారా కట్టడి చేసేందుకు వీలు ఉంటుందని అన్నారు. దీనికోసం సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఉంచడం, సరిహద్దు అధికారులు ఒకరికొకరు పరస్పరం సమచారాన్ని చేరవేసుకుంటూ ముందుకు సాగాలని ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ననుసరించి నల్గొండ జిల్లాలో వాడ పల్లి సమీకృత చెక్ పోస్ట్,నాగార్జున సాగర్ సమీకృత చెక్ పోస్ట్,సాగర్ టెయిల్ పాండ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు, నగదు
మద్యం పంపిణీపై పటిష్ట నిఘా ఉంచినట్లు, సరిహద్దు జిల్లా అధికారులు కూడా చెక్ పోస్ట్ ల నగదు మద్యం సరఫరా కాకుండా నిఘా ఉంచాలని,సమాచారం అందితే వెంటనే తెలియ చేయాలని అన్నారు.ఇప్పటికే దాచేపల్లి మండలం పొందుగల,సాగర్,సత్రశాల వద్ద చెక్ పోస్ట్ లు పని చేస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ తెలిపారు.పరస్పర సహకారం తో సమన్వయం తో పని చేయ నున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డి.ఎస్.పి.వి.వెంకట గిరి,ఎక్సైజ్ సూపరింటెండంట్ సంతోష్,రవాణా శాఖ అధికారి సురేష్ ఇతర శాఖల తదితరులు పాల్గొన్నారు.