మైలారంలో ఎర్రబెల్లి ప్రచారం – వెల్లువెత్తిన అభిమానం

మైలారంలో ఎర్రబెల్లి ప్రచారం – వెల్లువెత్తిన అభిమానం

అక్షిత న్యూస్ రాయపర్తి
ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం రోజు మండలంలోని బందనపల్లి కొత్తూరు పెరికేడు కొండాపురం గట్టికల్లు ఊకళ్లు వెంకటేశ్వర పల్లి సన్నూరు మైలారం గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ సందర్భంగా మైలారం గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మంత్రికి డప్పులు బోనాలు బతుకమ్మలతో కోలాటాలతో స్వాగతం పలికిన గ్రామ కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు మైలారం గ్రామ టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు గజమాలతో సత్కరించి దయన్న గెలుపుకు తాము అహర్నిశలు పాటుపడతామని మునుపు కంటే ఎక్కువ మెజార్టీ తో గెలిపించుకుంటామని అన్నారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల ఎన్నికల ఇన్చార్జి గుడిపూడి గోపాలరావు కార్యకర్తలతో కలిసి నృత్యం చేసి అందర్నీ ఉత్సాహపరిచాడు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నరసింహ నాయక్ మండల పార్టీ అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి ఆకుల సురేందర్రావు జెడ్పిటిసి రంగు కుమార్ గౌడ్ ఎంపీపీ జీనుమిరెడ్డి ప్రధాన కార్యదర్శి పూస మధు మైలారం గ్రామం సర్పంచ్ కసుమతి యాదవ్ రెడ్డి ఎంపీటీసీ గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking