“రాజు”కు అంతర్జాతీయ ఖ్యాతి అభినందనీయం

రాజుకు అంతర్జాతీయ
ఖ్యాతి అభినందనీయం

రాజా ఇన్ ఫ్రాలో బక్రా భజేగా ఫేమ్

రెడ్ ఎఫ్ఎమ్ ఆర్ జే రాజు సందడి

పారదర్శకత రాజా సొంతం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

రియల్ రంగంలో పారదర్శకతతో బిజినెస్ చేస్తూ రాజా ఇన్ ఫ్రా అంతర్జాతీయ ఖ్యాతి నార్జించడం అభినందనీయమని బక్రా భజేగా ఫేమ్ రెడ్ ఎఫ్ఎమ్ ఆర్ జే రాజు అన్నారు. శనివారం హైదరాబాద్ తార్నాకలోని రాజా ఇన్ ఫ్రా ప్రధాన కార్యాలయంలో రాజా ఇన్ ఫ్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజును అభినందించారు.

రియల్ రంగంలో విశిష్ట సేవలందిస్తున్న రాజా ఇన్ ఫ్రాకు రియల్ ఐకాన్ అంతర్జాతీయ అవార్డు అందుకున్న చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజును అభినందించారు. రాజా ఇన్ ఫ్రా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం ఆనందంగా ఉందని చెప్పారు. అంతర్జాతీయ ఖ్యాతితో మరింత బాధ్యత పెరిగిందని, ఇన్వెస్టర్లకు మరింత నమ్మకం, విశ్వాసంతో మరిన్ని సేవలoదించాలన్నారు. అక్షిత గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దాస్ యం. మాట్లాడుతూ రియల్ రంగంలో హైదరాబాద్ కు సాటిగా మరోటి లేదన్నారు. గతంలో దక్షిణ భారత్ లోని కొన్ని రాష్ట్రాల ప్రజల దృష్టిని హైదరాబాద్ ఆకర్షించగా ప్రస్తుతం దక్షిణ భారత్ తో పాటుగా ఉత్తర భారత్ లోని మరికొన్ని రాష్ట్రాల ప్రజలు దృష్టి సారించారన్నారు. ఆర్థికంగా కాసింత స్థిరపడిన ప్రతి వ్యక్తి, సంస్థ హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను చేపట్టేందుకు యోచిస్తున్నారన్నారు. సకల సదుపాయలు, భద్రత పరంగా అనువుగా ఉండడంతో హైదరాబాద్ ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతుందన్నారు. జాతీయ,అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ నగరంలో విస్తరిస్తుండడంతో హైదరాబాద్ డిమాండ్ అదే స్థాయిలో రెట్టింపు అవుతుందన్నారు.ఇప్పటికే అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో హైదరాబాద్ పరిధి విస్తరించగా మరింత విస్తరింప చేసేందుకు ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డుపై దృష్టి సారించిందన్నారు. హైదరాబాద్ రియల్ బిజినెస్ ఎప్పటి కప్పుడు తారాస్థాయిలోనే ఉంటుందని, ఇంకనూ మరింత పుంజుకుంటుందన్నారు. రియల్ బిజినెస్ లోనే చక్కటి ఆర్థిక పురోగతి ఉంటుందని, పారదర్శకత కల్గిన బిజినెస్ చేస్తూ కస్టమర్లు, ఇన్వెస్టర్ల మదుపుల పురోగతికి చోటివ్వాలని ఆయన ఆకాంక్షించారు. లక్ష్యాన్ని ఎంచుకొని బిజినెస్ చేస్తే సక్సెస్ మీ సొంతం అవుతుందన్నారు. తొలుత రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు, స్టాఫ్ తో కలిసి ఆర్ జే రాజును శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించిన మార్కెటింగ్ టీంకు ఆకర్షణీయమైన బొనాంజాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ సేల్స్ డైరెక్టర్ సునీత, హెచ్ఓడి రజని, రాజా ఇన్ఫ్రా స్టాఫ్, మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking