వీఆర్వోలను రెవెన్యూ శాఖలో కొనసాగించాలి
-తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికే ఉపేందర్ రావు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
వీఆర్వోలను రెవెన్యూ శాఖలో కొనసాగించాలని గ్రామ రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేయడం వలన ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వీఆర్వోలు తమ హక్కులను కోల్పోయారని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికే ఉపేంద్ర రావు వాపోయారు.ఆదివారం ఖమ్మం నగరం టిటిడిసిలో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గరికే ఉపేందర్ మాట్లాడుతూ సమస్త ప్రజలు కలలు గన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటు అయిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.వీఆర్వోలను రెవెన్యూశాఖలో కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామస్థాయి నుండి మండల డివిజన్ జిల్లా రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యుశాఖను బలోపేతం చేయాలన్నారు. సమగ్ర భూసర్వే చేసి ప్రతి అంగులం కొలిచి ప్రభుత్వ భూములను గుర్తించి రైతుల పట్టా భూములకు శ్వాశత పట్టా హక్కులను కల్పించాలన్నారు.సిఎం రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తీర్మానం చేశారు.ఈ కార్యక్రమంలో హారలే సుధాకర్ రావు సున్నం రామారావు పివి మోహన్ కొనాబోయిన ప్రసాద్ నాగుల మీరా చీమల నాగేంద్ర బాబు బంక కృష్ణ భాస్కర్ వెంకన్న ఇప్తకర్ తదితరులు పాల్గొన్నారు.