తెలంగాణలో కార్ ఇన్ ఆటో మార్ట్ కు అరుదైన పురస్కారం
-తెలంగాణ బిజినెస్ అవార్డు 2023 సాధించిన కార్ ఇన్ ఆటోమార్ట్
-ఖమ్మానికి అవార్డు పట్ల పలువురి హర్షం
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఏషియన్ అరబ్ ట్రేడ్ ఛాంబర్ అఫ్ కామర్స్ అద్వర్యం లో హైదరాబాద్ లో శనివారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా మోస్ట్ ప్రామిసింగ్ యాక్సెసరీస్ స్టోర్ 2023 అవార్డు ఖమ్మం నగరంలోని ప్రముఖ కార్ యాక్సెసరీస్ షోరూం కార్ ఇన్ ఆటోమార్ట్ కైవసం చేసుకుంది.నిర్వాహకులు ఏషియన్ అరబ్ ట్రేడ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఛైర్మెన్ అబ్ద్ అల్ ముఖద్ధిస్ చేతుల మీదుగా కార్ ఇన్ ఆటోమార్ట్ అధినేత అబ్దుల్ అజీమ్ ఈ అవార్డు ను ఇటీవల హైదరాబాద్లో అందుకున్నారు.ఈ సందర్భంగా కార్ ఇన్ ఆటో మార్ట్ సంస్థల అధినేత చైర్మెన్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ (ఎన్నారై పారిశ్రామికవేత్త) మాట్లాడుతూ దశాబ్దకాలానికి పైగా ఖమ్మం నగరం తో పాటుగా హైదరాబాద్ లో కూడా తమ సేవలు అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతున్న క్రమంలో ఈఅవార్డు రావడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఈ అవార్డు లభించడం పట్ల తన బాధ్యత మరింత పెరిగిందని కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే దిశగా తమ సంస్థ కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సంస్ద తరపున అబ్దుల్ అజీమ్ నసీం జహీర్ అజహర్ నాసర్ తదితరులు పాల్గొన్నారు.ఖమ్మానికి చెందిన సంస్ద ఒక రాష్ట్ర స్థాయి అవార్డు సాధించటం ఏంతో సంతోషం అని ప్రస్తుతం ఖమ్మం నగరం కూడా వ్యాపార రంగం లో హైదరాబాద్ విజయవాడ నగరాలకు దీటుగా సేవలు అందిస్తుందని చెప్పటానికే ఇదొక నిదర్శనం అని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎమైన్ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఛైర్మెన్ కొమ్ముల రాకేష్ పేర్కొన్నారు.ఈ సందర్భంలో నగరానికి చెందిన నగర ప్రముఖులు వైద్యులు వివిధ వ్యాపారాలకు చెందిన వారు వసీం అబ్దుల్ వాహెద్ ఖయ్యుమ్ అఫ్రోజ్ మున్వర్ అష్రీఫ్ బోడేపూడి రాజా మోతుకూరి శ్రీనివాస్ అబ్దుల్ రాఫాయ్ డాక్టర్ సుదర్శన్ రావు పారుపల్లి నాగేశ్వర్ రావు టియూడబ్యుజే (టిజేఎప్ ) ఎలక్ట్రానిక్ మీడియా ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి జర్నలిస్ట్ జానిపాషా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.