బైక్ కి నిప్పంటించి దగ్ధం చేసిన గుర్తు తెలియని దుండగులు

బైక్ కి నిప్పంటించి దగ్ధం చేసిన గుర్తు తెలియని దుండగులు

– లక్ష్మాపురంలో గ్రామంలో ఘటన

– స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

– రంగంలోకి డాగ్ స్క్వాడ్ మరియు క్ల్యు టీమ్

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

గుర్తు తెలియని వ్యక్తులు బైక్ కి నిప్పంటించి దగ్ధం చేసిన ఘటన మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో చోటు చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తుల కృష్ణ గౌడ్ కి సంబంధించిన బైక్ ను రోజువారీగా తన కార్యక్రమాలు ముగించుకొని ఇంటి ముందు ఉంచారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దానికి నిప్పు పెట్టీ పారిపోయారు. అర్ధరాత్రి సమయంలో మేలుకోవ రాగా ఏదో శబ్దం వినిపించి, బయట ప్రాంతంలో వెలుతురుగా కనిపించడం వల్ల బయటకు వెళ్లి చూడడంతో తన బైక్ కాలిపోతుండడంతో హుటా హుటిన కుటుంబ సభ్యులతో కలిసి నీళ్లతో మంటలు చల్లార్పడం వల్ల తృటిలో పెను ప్రమాదం తప్పింది.

ఈ విషయంపై బత్తుల కృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంతటి అగత్యానికి పాల్పడిన వారిని కనిపెట్టేందుకు రంగంలోకి డాగ్ స్క్వాడ్ మరియు క్ల్యూ టీమ్ వాళ్లు చేరుకొని ఆధారాలు సేకరణ కోసం గాలింపు చర్యలు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking