ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన
– నిర్వహించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
– ముఖ్య అతిథిగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి
నకిరేకల్, అక్షిత ప్రతినిధి :
భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ను వచ్చే నెల జనవరిలో నిర్వహిస్తున్న సందర్భంగా హైదరాబాదులో తార్నాక కేంద్రంగా గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో శనివారం నాడు రామన్నపేట మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నేను ఈ పాఠశాలలోనే ప్రాథమికొన్నత విద్యను అభ్యసించి ఈ సంస్థ డైరెక్టర్ స్థాయికి ఎదిగానని ఆనంద వ్యక్తం చేశారు. విద్యార్థులలో శాస్త్రీయ వైఖరిని పెంపొందించడానికి సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ ప్రదర్శనలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు ఇన్నోవేషన్ ప్రాజెక్టులు ప్రదర్శించారు. నీటి వృధా నిర్వహణ, పంట పురుగుల నివారణ పద్ధతులు, మెగ్నీషియం బ్యాటరీ, పేపర్ హోల్డింగ్ మైక్రోస్కోప్లను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో మండల కేంద్రంలోని ఆయా పాఠశాలల నుండి సుమారుగా 200 పైగా విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శనలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సీనియర్ శాస్త్రవేత్తలు వత్సల రాణి, వెంకట మోహన్, డాక్టర్ కే.రాజేందర్ రెడ్డి, మండల విద్యాధికారి వి.శ్రీధర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ భరత్ కుమార్, స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు శేషాచారి, సుదర్శన్ రెడ్డి, జరేనా బేగం, విజయ, రాణి, సైదులు రెడ్డి, సేవసాదు, మండల నోడల్ ఆఫీసర్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.